ప్రతిరోజూ కూడా ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపై అత్యాచారం చేసే వారికి కఠిన శిక్షలు విధిస్తున్నా కూడా , కామాంధుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఖమ్మం జిల్లా, రూరల్ మండలంలోని పల్లెగూడెం గ్రామానికి చెందిన బాలిక అత్యాచారయత్నం ఆపై హత్యాయత్నానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే బాలిక మృతికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించి మొదట తల్లిదండ్రులు ఓ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో బాలిక తల్లిదండ్రులు పల్లెగూడెంలోని ఓ వ్యక్తి వద్ద కొంత నగదును అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పు తీర్చడానికి ఇబ్బందులు పడుతుండటంతో అప్పు ఇచ్చిన వ్యక్తి అల్లం సుబ్బారావు ఖమ్మం ముస్తఫానగర్ లోని ఓ ఇంట్లో పని మనిషిగా పనికి కుదిర్చాడు. అయితే , గత నెల 18న ఖమ్మం ముస్తఫా నగర్ లో కోరిక తీర్చలేదని బాలికపై ఇంటి ఓనర్ కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 75 శాతం కాలిన గాయాలైన బాలికకు ఖమ్మంలోని శ్రీపూజ ఆస్పత్రిలో ఇంటి ఓనర్ అల్లం సుబ్బారావు రహస్యంగా చికిత్స చేయించారు. ఈ నెల 5న కోమా నుంచి బయటపడ్డ అమ్మాయి.. అసలు విషయం చెప్పడంతో దారుణం గురించి తెలిసింది. మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలతో అక్కడ నుంచి రెయిన్ బో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజులు అక్కడ చికిత్స తీసుకున్న బాలిక గత వారం గురువారం రాత్రి చనిపోయింది.
తమ కూతురు మృతికి అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా కారణమేనని బాలిక తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అయితే మరికొందరి వాదన ప్రకారం.. అప్పు తీర్చలేని క్రమంలోనే ఆ వ్యక్తి బలవంతంగా బాలికను ఇంట్లో బందించి పని చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డిని వివరణ ఇవ్వమని అడగ్గా .. ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కాగా బాలిక కుటంబు సభ్యులను పరామర్శించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ప్రభుత్వం తరఫున రెండు లక్షల సాయం అంధించారు. దోషులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.