ముర‌ళీధ‌రరావు మంచి బేర‌గాడే బాసూ!

Update: 2018-05-20 04:22 GMT
ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టుకోవ‌టం కోసం.. ప్ర‌లోభాల ప‌ర్వానికి అధికార‌ప‌క్షానికి చెందిన నేత‌లు రంగంలోకి దిగ‌టం కామ‌న్. కానీ.. తాజాగా క‌ర్ణాట‌క ఎపిసోడ్‌లో ఏకంగా ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చున్న వ్య‌క్తి రంగంలోకి దిగ‌టం ఒక ఎత్తు అయితే.. దానికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చిన వైనం సంచ‌ల‌నంగా మారింది.

త‌న సీఎం ప‌ద‌విని కాపాడేందుకు య‌డ్యూర‌ప్ప దేనికైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన ఆడియో టేపు బ‌య‌ట‌కు వ‌చ్చి హాట్ టాపిక్ గా మారిన వేళ‌.. మ‌రో ఆడియో క్లిప్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో ముర‌ళీధ‌ర రావు ప‌నిత‌నం ఎంత‌న్న విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పాలి.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తో బేర‌సారాల‌కు దిగిన గాలి జ‌నార్ద‌న‌రెడ్డి.. య‌డ్యూర‌ప్ప‌ల ఆడియోటేపులు బ‌య‌ట‌కు రాగా.. తాజాగా ముర‌ళీధ‌ర‌రావు మాట్లాడిన ఆడియో టేపు బ‌య‌ట‌కు వ‌చ్చింది. య‌డ్యూర‌ప్ప ఫోన్ కాల్ కు కంటిన్యూష‌న్ గా ముర‌ళీధ‌ర‌రావు ఫోన్ కాల్ గా చెప్పాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే పాటిల్ తో ఫోన్ కాల్ లో మంత్రి ప‌ద‌వి.. డ‌బ్బులు ఆశ చూపిన య‌డ్డికి ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తాన‌ని చెప్ప‌గా.. త‌న‌కు కాదు.. శ్రీ‌రాముల‌తో మాట్లాడాల‌ని య‌డ్యూర‌ప్ప సూచించిన సంగ‌తి తెలిసిందే.

అందుకు త‌గ్గ‌ట్లే పాటిల్‌.. త‌న త‌ర్వాతి ఫోన్ కాల్ ను శ్రీ‌రాములుకు చేశారు. ఈ సంద‌ర్భంగా బీజేపీలోని ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రైన ముర‌ళీధ‌ర‌రావు మాట్లాడిన వైనం.. ఆయ‌న ఆఫ‌ర్ చేసిన మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా విడుద‌లైన  ఆడియో టేపులో ఏమున్న‌ద‌న్న‌ది చూస్తే..

శ్రీరాములు: మీరెంత(పాటిల్‌) కావాలనుకుంటున్నారు?

పాటిల్‌: మీరే చెప్పండి

శ్రీరాములు: మీతో పాటు ఎంత మంది ఉన్నారు?

పాటిల్‌: ముగ్గురు నుంచి నలుగురు ఉన్నారు

శ్రీరాములు: 10-15 మందిని తీసుకురాగాలరా?

పాటిల్‌: తీసుకొస్తే వాళ్ల పొజిషన్‌ ఏంటి?

శ్రీరాములు: వారికి మంత్రిపదవులు ఇస్తాం

పాటిల్‌: నా నియోజకవర్గంలో ప్రత్యర్థి గట్టివాడు. ఉప ఎన్నికలొస్తే కష్టం

శ్రీరాములు: ఉప ఎన్నికలొచ్చే ప్రసక్తే లేదు. మురళీధర్‌రావుతో మాట్లాడండి

మురళీధర్‌రావు: ఏపీ - తెలంగాణల్లో రాజ‌కీయాలు చూశారుగా. రాజీనామాలు.. ఉప ఎన్నికల ప్రసక్తే లేదు.

పాటిల్‌: నాతో పాటు ముగ్గురు నలుగురు ఉన్నారు. ఫిగర్‌ ఎంతో వారికే చెప్పండి

మురళీధర్‌రావు: 15 అని ముందే చెప్పా.

పాటిల్‌: మేం సిద్ధంగా ఉన్నాం.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News