అమెరికా, బ్రిట‌న్ వ‌రుస‌లోనే ఆస్ట్రేలియా

Update: 2017-05-16 10:36 GMT
ఉగ్ర‌వాదం భూతం ప్రపంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. ముఖ్యంగా అగ్ర‌దేశాలు అయితే ప్ర‌తి విష‌యంలో క్షుణ్ణంగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అమెరికా - బ్రిట‌న్‌ లు త‌మ దేశంలో ప‌ర్య‌టించే వారు ల్యాప్ ట్యాప్‌ ల‌ను విమాన ప్ర‌యాణాల్లో వెంట‌బెట్టుకు రావ‌ద్ద‌ని నిషేధించింది. అదే రీతిలో ఇప్పుడు ఆస్ట్రేలియా సైతం చేరింది. త‌మ దేశంలో విమాన ప్ర‌యాణికులు ల్యాఫ్ ట్యాప్‌ లు తీసుకువెళ్ల‌వ‌ద్ద‌ని ఆస్ట్రేలియా ఆర్డ‌ర్ జారీ చేసింది.

ఉగ్ర‌వాదులు త‌మ ఉనికిని చాటుకునేందుకు ల్యాఫ్ ట్యాపుల్లో బాంబులు పెట్టి విమానాశ్ర‌యాల్లో అల‌జ‌డి సృష్టించ‌డానికి ప్రయ‌త్నం చేస్తున్నార‌నే వార్త‌ల నేప‌థ్యంలో అమెరికా - బ్రిట‌న్ దేశాలు ల్యాప్ టాప్‌ ల‌పై నిషేధం విధించాయి. దీంతో ఆస్ట్రేలియా కూడా ఈ నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ విమానాల్లో లాప్‌ ట్యాప్‌ లను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని దేశ ప్రధాని మాల్కోమ్ టర్న్‌ బుల్ చెప్పారు. దీంతో త్వరలోనే మరిన్ని దేశాలు కూడా విమాన ప్రయాణాల్లో ల్యాప్‌ ట్యాప్‌ లను నిషేధించే అవకాశం ఉందని అంచ‌నా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News