ఆ బ్రాలలో రూ.7వేల కోట్లు..?

Update: 2016-02-15 17:30 GMT
అందమైన ప్యాక్ లలో ఉన్న నాజూకు బ్రాలు.. దానిపై మోడల్ హోయలు చూసినోళ్లు.. వావ్ ప్యాక్ బాగుందనే అనుకుంటారు. కానీ.. ఆ బ్రాలలో ఉన్న అసలు గుట్టు తెలిస్తే కరెంటు షాక్ కొట్టటమే కాదు.. వాటి దరిదాపుల్లోకి వెళ్లేందుకు కూడా వణికిపోవటం ఖాయం. తాజాగా ఆస్ట్రేలియా దేశ చరిత్రలోనే అతి పెద్ద డ్రగ్ రాకెట్ గుట్టురట్టైంది.

అత్యంత విలువైన డ్రగ్ ను ద్రవరూపంలో తయారు చేసి.. దాన్ని బ్రా మధ్యలో జాగ్రత్తగా అమర్చటం ద్వారా దాదాపు రూ.7వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను అక్రమ సరఫరా చేసేందుకు ప్లాన్ చేశారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారంతో కొన్నాళ్లుగా నిఘా ఉంచిన పోలీసు అధికారులు తాజాగా ఈ బ్రా గుట్టు రట్టు చేశారు. సిడ్నీలోని మిరండా.. హర్స్ ట్ విల్లే..పెడాస్టో.. కింగ్స్ గ్రూవ్ ప్రాంతాల్లోని బ్రా ప్యాకెట్లను తనికీ చేయగా.. జెట్ బ్రాలతో పాటు.. ఇంటి ఉపకరణాలలో డ్రగ్స్ ను భారీగా నిల్వ ఉంచిన విషయాన్ని గుర్తించారు.

తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ డ్రగ్ విలువ దాదాపు రూ.7వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక చైనీయుడ్ని.. ముగ్గురు హాంకాంగ్ కు చెందిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 120 లీటర్ల ఈ డ్రగ్ విలువను తెలుసుకున్న వారంతా నోరెళ్లబెట్టే పరిస్థితి.
Tags:    

Similar News