యాషెస్ సిరీస్.. ప్రపంచ అత్యుత్తమ క్రికెట్ పోరాటాల్లో ఒకటి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఈ సిరీస్ ను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 14 ఏళ్లుగా ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ విజయాన్నందుకోని ఆస్ట్రేలియా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ యాషెస్ గెలవాలని పట్టుదలతో ఇంగ్లాండ్ లో అడుగుపెట్టింది. కానీ వాళ్ల ఆశ తీరలేదు. తొలి టెస్టులోనే కంగుతిన్న ఆస్ట్రేలియా రెండో టెస్టులో విజయం సాధించినా.. మళ్లీ వరుసగా రెండు టెస్టుల్లో ఓడి సిరీస్ చేజార్చుకుంది. అందులోనూ నాలుగో టెస్టులో 60 పరుగులకే కంగారూలు కుప్పకూలిన తీరు క్రికెట్ ప్రేక్షకులందరినీ విస్మయపరిచింది. ఐతే నామమాత్రమైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కు భలే షాకిచ్చింది.
తొలి ఇన్నింగ్స్ లో 481 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ ను గట్టి దెబ్బ తీసింది. ఆస్ట్రేలియా బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 107 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు ఇంకా 374 పరుగులు వెనకబడి ఉంది. ఆ జట్టు మహా అయితే ఇంకో 20-30 పరుగులు చేస్తుందేమో. తొలి ఇన్నింగ్స్ లో 300 పరుగులకు పైగా ఆధిక్యం కోల్పోవడమంటే ఇక ఓటమి ఖరారైనట్లే. ఇన్నింగ్స్ ఓటమి ఖాయమన్నట్లే ఉంది పరిస్థితి. 2-3తో సిరీస్ ఓడిపోవడమంటే ఆస్ట్రేలియా గౌరవప్రదంగా ఓడినట్లే. ఐతే ఓటమి ఓటమే కాబట్టి ఈ ప్రభావం ఆస్ట్రేలియా క్రికెట్ మీద కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే కెప్టెన్ మైకేల్ క్లార్క్ తో పాటు ఓపెనర్ రోజర్స్ రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఐతే వాళ్లిద్దరికి ఓ ఘనవిజయంతో వీడ్కోలు పలకాలన్న ఆస్ట్రేలియా జట్టు కోరిక మాత్రం తీరబోతున్నట్లే.