ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెట్ అభిమానులు.. క్రికెటర్లు కళ్లు అప్పగించి చూసే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నే. ఈ శత్రుదేశాల మధ్య పోరు యుద్ధాన్ని తలపిస్తుంది. అందుకే మెల్ బోర్న్ స్టేడియంలో మొన్న 90వేల మంది చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది టీవీల్లో చూశారు. అందరినీ మునివేళ్లపై నిలబెట్టే భారత్, పాక్ మ్యాచ్ లకు ఇప్పటికీ బోలెడంత డిమాండ్ ఉంది.
కేవలం అబిమానులే కాదు.. టాప్ మోస్ట్ క్రికెటర్లు సైతం దాయాదుల సమరాన్ని చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఇంతటి ఉత్కంఠ మ్యాచ్ లపై ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ సైతం తన మనసులోని మాట బయటపెట్టాడు. తాను త్వరగా రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని ఇండియా-పాక్ మ్యాచ్ ను ఆస్వాదించాలని ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు.
"ఫలితం ఎలా ఉన్నా... భారత్-పాకిస్థాన్ ఆట అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నాను. అది ఎంత పెద్ద గొడవో నాకు తెలుసు. నేను రిటైర్ అయ్యి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించే రోజు కోసం వేచి చూస్తున్నాను. ప్రస్తుతం చూడడానికే భయపడ్డాను" అని ఫించ్ చెప్పాడు.
విరాట్ కోహ్లి గురించి ఆసీస్ కెప్టెన్ మాట్లాడుతూ భారత మాజీ కెప్టెన్ అతని అత్యుత్తమ ప్రదర్శనను చూడటం ఎల్లప్పుడూ ఒక ట్రీట్ అని కొనియాడాడు. " విరాట్ కోహ్లీ మాస్టర్ క్లాస్! ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉన్నప్పటికీ... విరాట్ ఉన్నట్లయితే... ప్రత్యర్థిపై ఎంత ఒత్తిడి తెస్తాడో అందరికీ తెలుసు.. విరాట్ ఆట చూడడం చాలా గొప్ప వీక్షణ అని' ఫించ్ పొగడ్తల వర్షం కురిపించాడు.
"అవుట్‌ఫీల్డ్ గత రెండు వారాలుగా తడిసి ముద్దయింది. ఈ స్టేడియంలో నేను చూడని తడి అది. రన్-అప్‌లు నిజమైన సమస్య.. అంతర్గత మైదానం చుట్టూ చాలా తడిగా ఉన్నాయి. ఇది ఆటగాళ్ల భద్రతకు సంబంధించినది' అని ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడిన తర్వాత మెల్ బోర్న్ పిచ్ గురించి ఫించ్ ఇలా నిరాశ వ్యక్తం చేశాడు.