ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్క్ నర్ సంచలన ప్రకటన చేశారు. పుట్టినరోజున సోషల్ మీడియాలో అతగాడు పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆల్ రౌండర్ గా ఆసీస్ క్రికెట్ జట్టులో పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న అతగాడు.. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని వెల్లడించి షాకిచ్చారు.
తన 29వ పుట్టినరోజు సందర్భంగా తన తల్లితో పాటు ఒక స్పెషల్ వ్యక్తిని లోకానికి పరిచయం చేశాడు. తన బాయ్ ఫ్రెండ్ రొబుస్టాతో పాటు.. మా అమ్మతో కలిసి బర్త్ డే డిన్నర్ అంటూ తన సహచరుడి ఫోటోను ప్రపంచానికి చూపిస్తూ పోస్ట్ చేశాడు.
ఆసీస్ తరఫున ఒక టెస్ట్.. 69 వన్డేలు.. 24 టీ 20 మ్యాచ్ లు అడిన ఫాల్క్ నర్.. గడిచిన ఏడాదిన్నరగా జట్టులోకి సెలెక్ట్ కావటం లేదు. 2017 అక్టోబరులో చివరి మ్యాచ్ ఆడిన అతగాడు.. తాను గే అంటూ తాజాగా ప్రకటించుకున్నారు. తనను తాను గే గా పరిచయం చేసుకున్న అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్లలో ఫాల్క్ నర్ రెండోవాడిగా చెప్పాలి.
2011లో ఇంగ్లండ్ కు చెందిన అంతర్జాతీయ క్రికెటర్ స్టీవెన్ డేవిస్ తనను తాను గేగా పరిచయం చేసుకున్నాడు. ఇది 2011లో చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఫాల్కనర్ ఇదే బాటలో నడవటమే కాదు.. తన బాయ్ ఫ్రెండ్ ను లోకానికి పరిచయం చేశాడు. బర్త్ డే స్పెషల్ గా అతగాడు పోస్ట్ చేసిన ఫోటో క్రికెట్ క్రీడారంగంలో సంచలనంగా మారింది.