కరోనా వైరస్ వ్యాప్తి తో జనాలు ఇంట్లో నుండి బయటకి రావాలి అంటేనే భయపడిపోతున్నారు. పలు దేశాలు సైతం విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఈ వైరస్ భయం తో జనాలు ప్రయాణాలకు మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయే శంషాబాద్ విమానాశ్రయం గురువారం నిర్మానుష్యంగా మారింది. అంతేకాక పలు ఎయిర్‌లైన్ సర్వీసులు కూడా రద్దవడం తో రాకపోకలు చాలావరకు స్థంభించాయి. మరోవైపు విదేశాల నుంచి వస్తున్న వారిని నేరుగా వారి లగేజ్ తో సహా ఐసోలేషన్ వార్డులకు తీసుకెళ్తున్నారు. అక్కడ నెగెటివ్ అని రెండు సార్లు తేలితేనే ఇంటికి పంపుతారు. అలాగే అతన్ని వచ్చే 14 రోజుల పాటు ఇంట్లోనే ఐసొలేషన్‌లో వుండాలని ఆదేశిస్తున్నారు.
కాగా, కరీంనగర్ లో ఏకంగా ఒక్కరోజే ఏడుగురు ఇండొనేషియన్స్ కు కరోనా పాజిటివ్ అని తేలడం తో విమాన ప్రయాణీకులపై మరింత నిఘా అవసరమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా శంషాబాద్ విమానాశ్రయం చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ ఇండియా లో ప్రభావం చూపడం ప్రారంభించినప్పటి నుండే శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. అయితే , ఎయిర్ పోర్ట్ లో స్క్రీనింగ్ టెస్ట్ చేసినా కూడా బయటకి వచ్చాక కరోనా పాజిటివ్ అని తేలుతుండటం తో ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మొత్తం పూర్తిగా పోలిసుల చేతుల్లోకి వెళ్ళింది. ఎయిర్ పోర్ట్ లో మనిషి అన్నవాడే కనిపించడం లేదు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్నది.
విమానాశ్రయానికి వెళ్ళే మార్గాలను ఒక్కటొక్కటే మూసివేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ రూట్స్ లో కేవలం అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే లోనికి పంపిస్తున్నారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. స్క్రీనింగ్ టెస్టులు చేసిన వెంటనే క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.ప్రయాణికులపై ఆంక్షలు విధించడం తో కొన్ని రోజులుగా అంతర్జాతీయ ట్రాఫిక్ తోపాటు దేశీయ ట్రాఫిక్ కూడా తగ్గుముఖం పట్టింది. తెలంగాణ లో ప్రస్తుత కరోనా పాజిటివ్ కేసులు 13 నమోదు కావడం తో ..ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం.