ఈ రోజు సిటీ బ‌స్సులు బంద్ ఎందుకో తెలుసా?

Update: 2018-08-07 03:30 GMT
దాదాపు కోటిన్న‌ర‌కు కాస్త త‌క్కువ‌గా ఉండే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో అత్య‌ధిక ప్ర‌జ‌లు వినియోగించే ప్ర‌జా ర‌వాణా ఆర్టీసీ. విస్తారంగా ఉండే మ‌హాన‌గ‌రంలో ఏ మూల నుంచైనా ప్ర‌జార‌వాణ అంటూ ఉందంటే అది ఒకి షేర్ ఆటోలు అయితే.. మ‌రొక‌టి ఆర్టీసీ సిటీ బ‌స్సులు. అయితే.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) సిటీ బ‌స్సులు.. ఆటోలు న‌గ‌రంలో తిర‌గ‌వు.

ఉన్న‌ట్లుండి ఈ పిడుగు ఏంటి?  మ‌హా ప్ర‌భు.. అంటారా?. కేంద్రం తీసుకురావాల‌ని భావిస్తున్న మోటారు వాహ‌నాల స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా ప్ర‌జా ర‌వాణా సంస్థ‌లు ఈ రోజు బంద్ పాటిస్తున్నాయి. ఇందుకు త‌గ్గ‌ట్లే టీఎస్ ఆర్టీసీ కార్మికులు.. ఆటో సంఘాలు సైతం బంద్ చేయాల‌ని తాజాగా డిసైడ్ అయ్యారు.

దీంతో.. ఈ రోజు సిటీ బ‌స్సుల‌తో పాటు.. మిగిలిన బ‌స్సు స‌ర్వీసులు సైతం డుమ్మా కొట్ట‌నున్నాయి. అత్య‌ధిక కార్మికులు ఉన్న కార్మిక సంఘాలు జాతీయ స్థాయి బంద్ ను చేప‌ట్టే దిశ‌గా నిర్ణ‌యం తీసుకోవ‌టంతో ఎక్క‌డి బ‌స్సులు అక్క‌డ ఆగిపోనున్నాయి. ఉద‌యం లేచింది మొద‌లు సాయంత్రం ఇంటికి చేరే వ‌ర‌కూ ఆర్టీసీ బ‌స్సులు.. ఆటోల‌తో ప్లాన్ చేసుకునే బ‌డుగు జీవుల‌తో పాటు.. ల‌క్ష‌లాది మందికి ఈ బంద్ కార‌ణంగా ఇబ్బంది ఎదురు కానుంది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ సిటీ స‌ర్వీసులు న‌డ‌వ‌వ‌ని.. సాయంత్రం నుంచి షురూ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఆటోల విష‌యంపై క్లారిటీ రావ‌టం లేదు. సో.. బ‌స్సుల్లో.. ఆటోల్లో  వెళ్లే వారంతా ప్ర‌త్యామ్నాయ ర‌వాణాపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంది. సో.. టేక్ కేర్!
Tags:    

Similar News