కృష్ణా జిల్లా తెలుగు దేశం పార్టీ కి బలమైన క్యాడర్ ఉన్న జిల్లా... గత పదిహేను సంవత్సరాలు గా పార్టీ కి కంచు కోటగా ఉన్న ఈ జిల్లాలో ఈ యేడాది వచ్చిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి మైండ్ చెదిరి పోయేలా చేశాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మహామహులు అందరూ మట్టి కరిచారు. వీరిలోనే పార్టీ పెద్ద తలకాయల్లో ఒకరు, మాజీ మంత్రి దేవినేని ఉమా మైలవరం లో ఓడిపోతే... అదే దేవినేని వంశాకురం దేవినేని అవినాష్ గుడివాడ లో ఓడిపోయారు.
ఇక మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉన్నా జూనియర్ అయిన అవినాష్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటన్నది ఇప్పుడు జిల్లా లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల కు ముందు అవినాష్ తనకు విజయవాడ తూర్పు లేదా పెనమలూరు సీట్లే కావాలని పట్టుబట్టాడు. అయితే బాబు డైరెక్షన్ తో అవినాష్ కు బాబాయ్ అయిన దేవినేని ఉమా పట్టు బట్టి మరీ అవినాష్‌ను బలవంతం గా గుడివాడ కు పంపారు. అక్కడ అవినాష్ ఓడిపోతాడని టీడీపీ లోనే చాలా మందికి తెలుసు. అయినా అక్కడ అవినాష్ ను బలి పశువును చేశారు.
గుడివాడ లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా దెబ్బతిన్న అవినాష్ ఇప్పుడు అక్కడ కు వెళ్లేందుకు ఎంత మాత్రం ఇష్ట పడడం లేదు. ఇక జిల్లా లో సీనియర్ నేతలు అయిన వంశీ, గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని నాని లాంటి వాళ్లు సైతం అవినాష్ ను పట్టించు కోవడం లేదట. ఇందుకు ఉమా వైఖరే కారణమంటున్నారు. ఉమా జిల్లా లో ఏ ఒక్కరిని రాజకీయం గా ఎదగనీయడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
గతం లో టీడీపీ నుంచి బయటకు వెళ్లిన ప్రస్తుతం మంత్రి కొడాలి నాని నుంచి నేటి వంశీ, గద్దె దంపతులు, కేశినేని నాని, మండలి బుద్ధ ప్రసాద్, దాసరి సోదరులు, బుద్ధా వెంకన్న ఇలా చెప్పుకుంటూ ఉమా బాధితుల లిస్టు లో చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వాళ్లంతా అవినాష్ ను కూడా శత్రువుగానే చూస్తోన్న పరిస్థితి. అవినాష్ కేవలం ఉమా కోటరీ లోనే ఉండిపోతున్నాడు. ఆ కోటరి నుంచి బయటకు రాక పోతే తనకు తెలియకుండానే సొంత పార్టీ లోనే చాలా మంది శత్రువులను ఏర్పరుచుకున్నట్లు అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమాకే దిక్కులేదు. అలాంటి ఉమ ఇంక అవినాష్ ఫ్యూచర్ ఏం కాపాడతాడన్నది కూడా సందేహమే. ఇక అవినాష్ సైతం ఏపీ తెలుగు యువత అధ్యక్షుడి గా అటు రాష్ట్ర స్థాయి లో పార్టీ కి యూత్ ను మళ్లించడం తో పాటు జిల్లా లోనూ సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేయకుండా ఉమా కనుసన్నల్లోనే నడిస్తే తన భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నట్లువుతుందని టీడీపీ వాళ్లే చెపుతున్నారు. మరి అవినాష్ జిల్లాలో కీలక నేతగా ఎదుగుతాడో ? లేదా ఉమా కోటరి లో మిగిలిపోతాడో ? చూడాలి.