పంద్రాగ‌స్టుకు 'ఆయుష్మాన్ భార‌త్' లాంచ్!

Update: 2018-07-05 13:45 GMT
ఏ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మోదీ స‌ర్కార్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో `నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్`(ఆయుష్మాన్ భార‌త్)కు పెద్ద‌పీట వేసిన సంగ‌తి తెలిసిందే. ఆ స్కీమ్ ద్వారా ద్వారా 10కోట్ల కుటుంబాలకు - సుమారు 50 కోట్ల మంది పేదలకు లబ్ది చేకూరనుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించారు. ఆయుష్మాన్ భార‌త్ వ‌ల్ల ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు మెడికల్ రీఎంబర్స్‌ మెంట్  ద‌క్క‌నుంద‌ని తెలిపారు. అయితే, ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డి దాదాపుగా 5నెల‌లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టివర‌కు ఆ దిశ‌గా ఏ చ‌ర్య‌లు చేప‌ట్టలేదు. అయితే, ఈ ప్ర‌తిష్టాత్మ‌క స్కీమ్ ను ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ప్రారంభించాల‌ని మోదీ యోచిస్తున్నార‌ట‌. పీపీపీ ప‌ద్ధ‌తిలో ఆయుష్మాన్ భార‌త్ ను చేప‌ట్టాల‌ని స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని - త‌ద్వారా ప్ర‌జాద‌ర‌ణ‌ను చూర‌గొనాల‌ని మోదీ ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఆయుష్మాన్ భార‌త్ లో భాగ‌స్వాముల‌య్యేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు - ప్రైవేటు ఆసుప‌త్రులతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని ఈ ప్రాజెక్ట్ సీఈవో ఇందు భూష‌ణ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఐటీ కంపెనీల స‌హ‌కారం కూడా తీసుకుంటామ‌ని చెప్పారు. కేవ‌లం ప్ర‌భుత్వ సెక్టార్ తోనే 50 కోట్ల మందికి సేవ‌లందించడం సాధ్యం కాద‌ని - అందుకోసం ప్ర‌భుత్వ‌ - ప్రైవేటు భాగ‌స్వామ్యంతో ఆయుష్మాన్ భార‌త్ ను ప్రారంభిస్తామ‌ని అన్నారు. ఆయుష్మాన్ భార‌త్ తో భాగ‌స్వామ్యం అయ్యే ఇన్సూరెన్స్ కంపెనీల‌ను ఫైన‌ల్ చేయాల్సి ఉంద‌న్నారు. ఈ త‌ర‌హా ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు భారీగా పెట్టుబ‌డి - మాన‌వ‌వ‌న‌రులు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అన్నారు. ఆగ‌స్టు 15 నాటికి ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నామ‌ని అన్నారు.
Tags:    

Similar News