సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను విభజించే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ను ఇస్తాం అని చెప్పారు. కానీ, ఆ తర్వాత ఆ హోదా ను ఇవ్వలేదు. హోదా అన్నది కుదరదు అని ఇప్పటికే పలుసార్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే, తాజాగా పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీ నేపథ్యంలో ఏపీలో బిజెపిని, వైసీపీని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు దేశంలో ఏ రాష్ట్రానికి కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ చెప్పిన బిజెపి ఇప్పుడు పుదుచ్చేరి ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తీసుకురావడంతో ఏపీలో దుమారం మొదలైంది. అలాగే బిజెపి మిత్ర పక్షాలకు మద్దతుగా పుదుచ్చేరిలో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో టీడీపీ నేతలు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తాజాగా వైసిపి నేతలపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు గుప్పించారు . రాష్ట్ర మంత్రి పేర్ని నాని టీడీపీపై విమర్శలు చేయడం ఆపి తాడేపల్లి వెళ్లి జగన్ రెడ్డి నిలదీయాలని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఒక కామిడీ పీస్ అంటూ విమర్శించారు. పుదుచ్చేరికి హోదా ప్రకటించిన బీజేపీపై రాష్ట్రంలో రంకెలు వేస్తున్నట్టు నటించడం కాదని, నేరుగా తాడేపల్లి వెళ్లి జగన్ రెడ్డిని నిలదీయాలన్నారు. బీజేపీ మిత్రపక్షాలను గెలిపించాలంటూ.. పుదుచ్చేరిలో వైసీపీ మంత్రులు ఎందుకు ప్రచారం చేస్తున్నారో నిలదీయాలని పిలుపునిచ్చారు. ఏపీలో డ్రామా... పుదుచ్చేరిలో ప్రేమ అంటే కుదరదు ఆర్టిస్ట్ నాని అని ట్వీట్ చేశారు.
అలాగే, పుదుచ్చేరికి ప్రత్యేక ప్రత్యేక హోదా అంశంపై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బీజేపీతో రహస్య ప్రయాణాన్ని కట్టి పెట్టేసి, పుదుచ్చేరిలో బీజేపీ మిత్రులు గెలుపు కోసం వైసీపీ నాయకులతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. కేసుల గురించి కాకుండా కాస్త ప్రత్యేక హోదా కోసం ఇప్పటికైనా గట్టిగా అడగండి అంటూ పుదుచ్చేరికి హోదా ఇస్తామన్న అంశాన్ని టార్గెట్ చేసి విమర్శలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ప్రత్యేక హోదాను జగన్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని , హోదా తీసుకురా లేని గొర్రెలు వైసీపీ ఎంపీలు అని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఏదేమైనా పుదుచ్చేరి లో బీజేపీ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రచారంలో వాడటం తో ఏపీలో అటు బీజేపీ , ఇటు వైసీపీ నేతలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.