అయ్య‌న్న పాత్రుడికి చేదు అనుభ‌వం!

Update: 2017-07-15 11:33 GMT

విశాఖ భూ కుంభ‌కోణం వ్య‌వ‌హారంలో సిట్ అధికారుల‌కు మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు శుక్ర‌వారం ఆధారాలు స‌మ‌ర్పించారు. ఈ కుంభ‌కోణంలో మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు పాత్ర  పై అయ్య‌న్న‌పాత్రుడు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శ‌నివారం అమ‌రావ‌తిలో జ‌రిగిన‌ ఎస్‌ ఆర్‌ ఎం యూనివర్శిటీ ప్రారంభోత్సవంలో అయ్యన్నపాత్రుడుకు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న‌ను పోలీసు సిబ్బంది లోప‌లికి వెళ్ల‌కుండా అడ్డుకున్నారు.

తాను మంత్రినన్న విషయం స్వయంగా చెప్పినా పోలీసులు బారికేడ్లు తొలగించేందుకు నిరాకరించారు. పోలీసుల వైఖ‌రిపై  ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌కుండానే వెనుదిరిగారు. రాజకీయ నాయకులకు అవమానాలు, గౌరవాలు సహజమేనని అయ్య‌న్న‌పాత్రుడు ఈ సంద‌ర్భంగా అన్నారు.

కొద్ది సేప‌టి త‌ర్వాత‌ ఈ విషయం తెలుసుకున్నగుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్ ....మంత్రి అయ్యన్నకు ఫోన్‌ చేశారు. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని కోరారు. మరోవైపు, మంత్రి గంటా శ్రీనివాసరావే ఇలా చేయించారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు. విశాఖ భూ కబ్జాల వ్యవహారంలో మంత్రులు గంటా, అయ్యన్న మధ్య విభేదాలున్న సంగ‌తి తెలిసిందే. అయ్యన్నతోపాటు పలువురు అతిథులను.. ప్రముఖులను కూడా లోపలికి వెళ్లకుండా గుంటూరు పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు.
Tags:    

Similar News