ప్రేమికుల స్వర్గధామంగా - ఐకాన్ ఆఫ్ ఇండియాగా నిలిచిన తాజ్ మహల్ ను యూపీలో ప్రతిపక్ష పార్టీ నేత ఆజం ఖాన్.. ఓ బానిస కట్టడంగా పేర్కొన్నారు. దానిని తక్షణ మే కూల్చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు, ప్రజల్లో తనకు ఎంతో పాపులారిటీ ఉందని, కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి తాను మద్దతిస్తానని సంబంధం లేని వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. నిజానికి ఆజం ఖాన్ ఏదో ఒక విషయంపై ఫైర్ అవుతూనే ఉన్నారు. మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని గతంలో ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. అయితే మహిళలంతా పాకిస్థాన్ కు పారిపోండి అంటూ అత్యంత వివాదం సృష్టించారు.
తాజాగా ఆజం ఖాన్.. మరోసారి వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రముఖ కట్టడమని చెప్పుకొంటున్న తాజ్ మహల్ ను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే.. తాను బీజేపీకి మద్దతు పలుకుతానని చెప్పుకొచ్చారు. తాజ్ ను కూలగొట్టాలన్న అంశాన్ని తాను దశాబ్దాల క్రితమే లేవనెత్తినట్టు చెప్పిన ఆయన, తాజ్ తో పాటు ఢిల్లీలోని ఎర్రకోట - పార్లమెంట్ - కుతుబ్ మినార్ వంటివి బానిసత్వానికి ప్రతీకలని, వాటన్నింటినీ కూల్చాలని డిమాండ్ చేశారు.
నిజానికి తాజ్ మహల్ కు ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. దీనిని చూసేందుకు విదేశాల నుంచి భారీసంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. దీంతో మనకు ఆదాయం కూడా పెరుగుతోంది. యూపీ టూరిజం మంత్రి రీటా బహుగుణ ఆధ్వర్యంలో తయారు చేసిన ఓ పర్యాటక బ్రోచర్ లో తాజ్ ప్రస్తావన లేకపోవడం కలకలం రేపింది. వారణాసిలో గంగా హారతి ముఖ చిత్రంతో - కవర్ పేజీపై ఆదిత్యనాథ్ - బహుగుణ చిత్రాలతో తయారైన 32 పేజీల పుస్తకాన్ని పలువురు విమర్శించిన సంగతి తెలిసిందే.
ఇక తాజ్ మహల్ ను కూల్చి వేయాలన్న ఆజం ఖాన్ వ్యాఖ్యలపై, బహుగుణ మాట్లాడుతూ, తాజ్ ఓ సుప్రసిద్ధ కట్టడమని, రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో టూరిస్టులను ఆకర్షించే ప్రాంతమని, ఇప్పటికే తాజ్ పరిరక్షణకు రూ.156 కోట్లు కేటాయించామని తెలిపారు. ఖాన్ వ్యాఖ్యలు అర్థరహితమని దుయ్యబట్టారు. ఇక, నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. `` నీ ఇల్లు కూలగొట్టుకుంటావా నేను మద్దతిస్తాను`` అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హాట్‌గా మారింది. మరి ఆజం స్పందిస్తాడో లేదో చూడాలి.