టీడీపీలో ఎదుగుతున్న యువనేత లోకేశ్ ను టార్గెట్ గా చేసుకుని ప్రతిపక్ష వైసీపీ నేతలు గత కొద్ది నెలలుగా ఓ ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అయితే.. సందర్భం ఉన్నా లేకున్నా కూడా కొన్ని ఫొటోలు చూపిస్తూ లోకేశ్ విదేశాల్లో అమ్మాయిలతో తిరుగుతున్నారంటూ పదేపదే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆయన ఆ విషయాన్ని అదేపనిగా ప్రచారం చేస్తుంటారు. దానిపై టీడీపీ పలుమార్లు క్లారిటీ ఇచ్చినా కూడా అంబటి తన తీరు మార్చుకోలేదు. దీంతో ఇంతవరకు అలాంటి చిల్లర ఆరోపణల జోలికి పోని టీడీపీ కూడా ఇక తప్పదంటూ కౌంటర్ ఇచ్చింది. టీడీపీ నేత యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ దీనిపై స్పందించి లోకేశ్ పై దుష్ర్పచారం మానుకోకుంటే జగన్ బండారం బయటపెట్టక తప్పదని హెచ్చరికలు జారీచేశారు. అంతేకాదు... చూచాయగా ఆయన జగన్ వ్యవహారాలను బయటపెట్టారు. ఇప్పటికైనా వైసీపీ తీరు మారకపోతే మొత్తం కథలన్నీ బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అంబటి రాంబాబు కోరి కెలుక్కుని మరీ జగన్ పై ఆరోపణలు చేయించినట్లయింది.
జగన్ కు సినీతారలతో సంబంధాలున్నాయని... ఆయన వారాలు, నెలల తరబడి మాయమవుతుంటారని... ఆ సమయంలో సినీతారలతోనే గడుపుతుంటారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ యువ నేత లోకేశ్ ఎప్పుడో పదేళ్ల కిందట చదువుకుంటున్న రోజుల్లో సహచరులతో కలిసి విహారయాత్రలు వెళ్లిన ఫొటోలన వైసీపీ నేతలు పదేపదే ప్రదర్శించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వైసీపీ నేతలు మళ్లీ ఇలాంటి చిల్లర విషయాలపై ఎక్కువ చేస్తే జగన్ రాసలీలన్నీ బయటకొస్తాయని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
జగన్ గుట్టుమట్లన్నీ తమకు తెలుసునని.. ఆయనకు సినిమా హీరోయిన్లతో ఎలాంటి సంబంధాలున్నాయో తెలుసని చెబుతూ ఆయన వారాల తరబడి ఎందుకు మాయమవుతుంటారు.. ఎక్కడెక్కడ ఏం చేస్తుంటారన్నది అందరికీ తెలుసని అంటూ విమర్శించారు. దీంతో ఇంతవరకు టీడీపీ ఏమాత్రం టచ్ చేయని విషయాన్ని వైసీపీ నేతల తీరు కారణంగానే మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇంతవరకు తెలియనివారికి కూడా జగన్ రహస్యాలు తెలిసి ఆయన ఇలాంటివాడా అనుకునే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి వైసీపీ నేతలే జగన్ పరువు తీస్తున్నట్లయింది.