సోషల్ మీడియాలో వచ్చేది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని రోజులు వస్తున్నాయి. సోషల్ మీడియా పుకార్లకు అతి పెద్ద వేదిక అవుతోంది. సమాచారం చేరవేయడంలో ఇది ఎంత పెద్ద వేదికగా ఉపయోగపడుతోందో తప్పుడు ప్రచారాలకూ అంతే పెద్ద వేదికగా ఉంటోంది. తాజాగా ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఆరోగ్యంపైనా ఇలాంటి వదంతులే సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అయితే... రాందేవ్ అనుచరులు, సన్నిహితులు మాత్రం అదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేస్తున్నారు.
యోగాగురు రాందేవ్ బాబా ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని ఫేస్ బుక్ - వాట్సప్ లలో వార్తలు వ్యాపిస్తున్నాయి. అంతేకాదు, ఈ ఘటనలో గాయపడిన ఆయనను స్ట్రెచర్ మీద ఆసుపత్రికి తరలిస్తున్నట్టు పలు ఫొటోలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. నిజంగా రాందేవ్ నే స్ర్టెచర్ పై తీసుకెళ్తున్నట్లుగా ఉన్న ఆ ఫొటోలు నిజమని నమ్ముతూ చాలామంది షేర్ చేస్తుండడంతో మరింత వేగంగా ఇది స్ర్పెడ్ అవుతోంది.
అయితే, ఈ సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన ఆయన సన్నిహితులు ఇవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం రాందేవ్ బాబా హరిద్వార్ లో సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు సృష్టించారని చెప్పారు. ఈ వార్తలను నమ్మకూడదని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/