బాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ బయట పెట్టిన విజయ సాయి

Update: 2019-12-21 05:39 GMT
అమరావతి సాక్షి గా చంద్రబాబు, ఆయన అనుయాయులు, బినామీలు చేసిన భూబాగోతాన్ని ట్విట్టర్ సాక్షిగా బయట పెట్టేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.  రాజధాని వస్తుందని అందరికీ ఒకే రోజు ముందే కల వచ్చిందా? ఇన్నివేల ఎకరాలు టీడీపీ నేతలు ఎలా కొన్నారంటూ ప్రశ్నించారు. అమరావతి, భోగాపురం  ఇలా ఏ ప్రకటన కు ముందే టీడీపీ నేతలు అక్కడ భూములు కొనడం వారికేమైనా కల వచ్చిందా అని దుమ్మెత్తి పోశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు చంద్రబాబు పాల్పడ్డారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పేటెంట్ అదే అని ఎద్దేవా చేశారు.

ఇక విశాఖ రాజధాని గా రావడం ఇష్టం లేని దత్త పుత్రుడు, పచ్చపార్టీ నేతలు వైఎస్ జగన్ పై నిందలు వేస్తున్నారని విజయసాయి రెడ్డి మండి పడ్డారు.

కడప స్టీలు విషయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని.. ఇనుప ఖనిజం సరఫరా హామీ లేకుండా స్టీల్ ఫ్యాక్టరీ ఎన్నికల ముందర ఓట్ల కోసం శంకుస్థాపన చేశారని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో కడిగేశారు. వైఎస్ జగన్ సర్కారు ఇప్పుడు 50లక్షల టన్నుల ఇనుప ఖనిజం సరఫరాకు ఎంఓయూ కుదుర్చుకుందని తెలిపారు.

జగన్ కు, మోసకారి బాబు కు ఇదే తేడా అంటూ వరుస ట్వీట్స్ తో వైసీపీ ఎంపీ కడిగేశారు. రాష్ట్రాల రాజధానుల ఎంపిక కేంద్రం పరిధి లేదని బీజేపీ ఎంపీ జీవిఎల్ స్పష్టం చేస్తున్నా చంద్రబాబు కోవర్టు సుజనా చౌదరి మాత్రం కేంద్రం చూస్తూ ఊరుకోదని బట్టలు చింపుకుంటున్నాడని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఆయన భూములు భారీగా అమరావతిలో ఉండబట్టే అని సెటైర్లు వేశారు.

ఇలా వరుస ట్వీట్స్ తో విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక గా చంద్రబాబు, పవన్, టీడీపీ నేతల పై యుద్ధం ప్రకటించారు.
Tags:    

Similar News