అవును! దాదాపు మూడు గంటలకు పైగానే ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు.. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో బైఠాయించి.. నిరసన తెలుపుతున్నారు. తనను తిరుపతిలోకి అనుమతించ డం లేదని..పేర్కొంటూ.. కటిక నేలపై ఆయన కూర్చున్నారు. ప్రభుత్వం తనను అడ్డుకుంటోందని ఆయన నిప్పులు చెరిగారు. ఇక, జగన్‌పైనా వ్యక్తిగత విమర్శలకుదిగారు. ఎన్నికల సమయంలో తనను అడ్డుకున్నారని.. ప్రజలను కలవకుండా చేస్తున్నారని.. ఎన్నికలలో ఓటమి భయంతోనే జగన్ సర్కారు ఇలా చేస్తోందని.. చంద్రబాబు నిప్పులు చెరిగారు.
మూడు గంటలుగా.. హైడ్రామా!
ఇక, పోలీసుల విషయానికి వస్తే.. కటిక నేలపై చంద్రబాబు బైఠాయిస్తారని.. వారు ఊహించలేదు. అయితే.. వెనువెంటనే చంద్రబాబును అక్కడ నుంచి వీఐపీ లాంజ్‌లోకి మార్చేందుకు ప్రయత్నించారు. నేలపై కూర్చోవద్దని.. చేతులు రెండూ జోడించి వేడుకున్నారు. అయితే..తాను మాత్రం కలెక్టర్, ఎస్పీలతో భేటీ అయ్యేవరకు నేలపై నుంచి లేచేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఇది వివాదంగా మారి.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.ఇక, ఇప్పటికే రేణిగుంట సహా తిరుపతి నగరంలో టీడీపీ నాయకులు.. శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించి.. నిరసనకు దిగారు.
తప్పు ఎవరిది?
ఇక, ఈ విషయంలో తప్పు ఎవరిది? అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఇటు పోలీసులది.. అటు టీడీపీ అధినేత చంద్రబాబుది కూడా ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్రంలోని నగరాలు, కార్పొరేషన్లలో కోడ్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో నిరసనలు, ధర్నాలకు, రోడ్ షోలకు అనుమతి లేదు. ఈ క్రమంలోనే తాము నోటీసులు ఇచ్చామని.. చంద్రబాబు విషయంలో పోలీసులు చెబుతున్నారు. ఇక,ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన చంద్రబాబు.. అక్కడికక్కడే బైఠాయించడం..విచారకరం. అయితే.. ఆయన అప్పటికి విరమించి.. వెంటనే మీడియా మీటింగ్ పెట్టుకుని ఉంటే హుందాగా ఉండేదని అనేవారు కూడా కనిపిస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎలా స్పందించినా.. తాము ఆవిధంగానే నడుచుకుంటా మని.. జిల్లా ఎస్పీ వెల్లడించారు.