ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయిపోయింది. ఈ రెండేళ్ల సమయంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి నెగిటివ్ రాలేదు. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీకి పెద్ద పాజిటివ్ కూడా లేదు. కాకపోతే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రం నిత్యం జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అసలు జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి చంద్రబాబు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. జగన్ అమలు చేసే ప్రతి పథకంపై విమర్శలు చేస్తున్నారు. ఇంత చేసినా సరే ప్రజలు ఇంకా జగన్ వైపు ఉన్నారని, ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయి. అటు చంద్రబాబు ఏ మాత్రం బలపడలేదని రుజువు చేశాయి.
తిరుపతి ఉప ఎన్నికల్లోనూ వైసీపీకి బంపర్ మెజార్టీ కట్టబెట్టారు. అయితే ఇంతలా ఫలితం వచ్చినా సరే బాబు తీరు మారడం లేదు. అదే స్థాయిలో జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. పైగా ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే రాజకీయం చేస్తున్నారు. ఈ రెండేళ్లలో బాబు ప్రజల్లోకి వచ్చి పోరాడిన సందర్భాలు చాలా తక్కువ. అటు నారా లోకేష్ సైతం జైలుకు వెళ్లిన టీడీపీ నాయకులని, కార్యకర్తలని ఓదార్చడానికి బయటకొస్తున్నారు తప్ప, ప్రజల కోసం బయటకు రావడం లేదు. ఎంతసేపు సోషల్ మీడియా, జూమ్ యాప్‌ల్లోనే ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. అయితే ఇలా ప్రతిదీ ఆన్‌లైన్‌లో చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఏ మాత్రం రీచ్ కాని పరిస్థితి.
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను, నాయకులను విస్మరించి ఓ ఐదారుగురు ఐఏఎస్ అధికారులను వెంటేసుకుని పదే సుధీర్ఘమైన సమావేశాలు పెట్టేవారు. దీంతో ఆయన కార్యకర్తలకు, నాయకులకు దూరమయ్యారు. ఇప్పుడు అధికారులు లేకపోవడంతో ఆన్‌లైన్‌లో కార్యకర్తలతో సుధీర్ఘమైన సమీక్షల పేరుతో వారికి క్లాసులు పీకుతున్నారు. ఇక ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేసినా, అదీ ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక ఈ అరెస్ట్‌కు నిరసనగా బాబు ఆన్‌లైన్ దీక్ష మొదలుపెట్టారు. కొందరు కర్నూలు టీడీపీ నేతలతో కలిసి జూమ్ యాప్‌లో నిరసన దీక్ష చేస్తున్నారు. ఇలా దీక్ష చేస్తున్నారని చదువుకున్నవారికి అర్ధమవుతుంది. మరి ఆన్‌లైన్ అంటే తెలియని వారికి బాబు దీక్షలు ఎలా తెలుస్తాయి. అందుకే ఇలా అన్నీ ఆన్‌లైన్లో చేయడం వల్ల టీడీపీ ప్రజల్లోకి వెళ్ళడం లేదు. మరి బాబు ఈ ఆన్‌లైన్ పరీక్ష ఎప్పుడు పాస్ అవుతారో చూడాలి. ఇక తాజాగా పార్టీకి పెద్ద పండగ అయిన మహానాడును సైతం ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.