చంద్రబాబు అడిగితే పొడిగిస్తాం: ఏపీ ప్రభుత్వం!

Update: 2019-07-10 07:59 GMT
ప్రస్తుతానికి అయితే 14 రోజుల ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్టుగా ప్రకటించారు ఏపీ స్పీకర్. రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యలో సెలవు రోజులు పోనూ.. మొత్తం 14 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు.

అలా ఈ నెల 30 వరకూ సమావేశాలు కొనసాగుతాయని  ప్రకటించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాకా తొలి బడ్జెట్ ను ఈ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టనున్నారు. అలాగే వ్యవసాయ బడ్జెట్ ప్రకటన కూడా ఉంటుంది.

బడ్జెట్ పై చర్చకు మిగతా రోజులను కేటాయించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకా ఇప్పటికే ఒకసారి సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం - స్పీకర్ ఎన్నిక తదితర కార్యక్రమాలు జరిగాయప్పుడు. అప్పుడే ఇరు పార్టీల మధ్యన వాడీవేడి  మాటల యుద్ధం సాగింది.

ఇక సభా సమావేశాలను కేవలం 14 రోజులకే పరిమితం చేయాలని అనుకోవడం లేదని - ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరితే సమావేశాలను మరిన్ని రోజులు పొడిగించడానికి కూడా రెడీ అని ఏపీ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.


Tags:    

Similar News