చేదు వార్త బూస్టర్ డోస్ తీసుకుంటేనే..!

Update: 2022-01-05 08:30 GMT
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది. వివిధ దేశాల్లో సుమారు 20 లక్షల కేసులు వెలుగు చూసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఒక్క అమెరికాలోనే ఐదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బ్రిటన్, ఫ్రాన్స్ లో సుమారు రెండు లక్షలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇటలీ, టర్కీ లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 6 వేలకు పైగా మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ దేశాలు ఆంక్షల వలయంలోకి వెళ్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్వో సూచనల ప్రకారం నడుచుకుంటున్నారు. వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చాలా దేశాలు మాస్క్ ని పట్టుకోవడం తప్పనిసరి చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే బూస్టర్ డోస్ పై కసరత్తులు చేస్తున్నాయి. రెండు టీకాలను తీసుకున్న ప్రజలు మూడో డోసును తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

మరోవైపు ప్రపంచ దేశాలలో కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి కొన్ని దేశాల్లో అయితే ఏకంగా లాక్ డౌన్ ను విధించాయి కరుణ వైరస్ పుట్టిన దేశమైన చైనాలో కేవలం రెండు మూడు కేసులు వచ్చినందుకే కొన్ని నగరాల్లో లాక్ డౌన్ విధించారు మరి కొన్ని దేశాల్లో అయితే రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి మరికొన్ని వీకెండ్ కర్ఫ్యూ లను విధించాయి చాలా దేశాల్లో ప్రజలు బయటకు రాకుండా ఆంక్షలను కఠిన తరం చేశాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. కొన్ని దేశాల్లో అయితే ఎంటర్టైన్మెంట్ జోన్ లను పూర్తిగా మూసేశాయి. జిమ్ లను, పబ్ లను, సినిమా హాళ్లపై కూడా నిషేధం విధించాయి. ప్రధానంగా వైరస్ వ్యాప్తి చెందేందుకు కారణమయ్యే టువంటి అంతర్జాతీయ విమానం ప్రయాణాలపై చాలా దేశాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను కఠినతరం చేశాయి.

పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రయాణాలు విధించింది. ఇందుకోసం కొత్త నిబంధనలను తీసుకొని వచ్చింది. తమ దేశానికి వచ్చే వారు ఖచ్చితంగా బూస్టర్ డోసు తీసుకొని ఉండాలని తేల్చిచెప్పింది. ఈ నిర్ణయాన్ని ఈ నెల పదో తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే భారతదేశం నుంచి ఉద్యోగాల కోసం అరబ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనదేశంలో బూస్టర్ డోస్ ఇచ్చిన దాఖలాలు లేవు. దీనిపై కేంద్రం ఇప్పుడిప్పుడే సమాలోచన చేస్తోంది. ఈ కారణంగా భారతదేశం నుంచి అరబ్ దేశాలకు వెళ్లి వారికి ఇది చేదు వార్త అని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News