సచిన్​, సెహ్వాగ్​ లాంటి వాళ్లు అవసరం! వరుస ఓటములపై సెటైర్లు

Update: 2020-12-02 01:30 GMT
ఆస్ట్రేలియా టూర్​లో భారతక్రికెట్ జట్టు పేలవమైన ప్రదర్శన ఇస్తున్న విషయం తెలిసిందే. వరుసగా రోజు వన్డే మ్యాచ్​లలో ఓటమి పాలైంది. బ్యాటింగ్​, బౌలింగ్, ఫీల్డింగ్​ ఇలా అన్ని విభాగాల్లోనూ అట్టర్​ప్లాప్​ అయ్యింది. షమీ, బుమ్రా లాంటి బౌలర్లు సైతం ప్రభావం చూపలేకపోయారు. ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్లు పరుగుల వరద పారించారు. మొదటి మ్యాచ్​లో 375, రెండో మ్యాచ్​లో 390 పరుగులు చేశారు. ఈ స్కోర్​ చూసేసరికే మనవాళ్లకు బెదురుపుట్టింది. దీంతో వరసగా రెండు మ్యాచ్​లలో టీం ఇండియా ఓడిపోయింది.

ఆస్ట్రేలియా లాంటి జట్టుతో ఆడాలంటే సరైన ప్రణాళిక ఉండాలని.. భారతజట్టు మాత్రం అందుకు భిన్నంగా మైదానంలోకి అడుగుపెట్టిందని సీనియర్​ క్రికెటర్లు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై సీనియర్​ క్రికెటర్​ బద్రీనాథ్​ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం భారత టాప్​ ఆర్డర్​ పటిష్ఠంగా లేదు. ఇప్పుడు సెహ్వాగ్​, సచిన్​టెండుల్కర్​ వంటి ఆటగాళ్లు అవసరం. అయితే దురదృష్టవశాత్తు మన దగ్గర అటువంటి క్రికెటర్లు లేరు.

భారత జట్టుకు ఇప్పుడు ఆల్​రౌండర్లు ఎంతో అవసరం. ఫేస్​బౌలర్లు బుమ్రా, షమ్రీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇప్పుడు టీంఇండియా జట్టుకు ఆల్​రౌండర్లు అత్యవసరం. గతంలో సచిన్​, సెహ్వాగ్​ లాంటి ఆటగాళ్లు బ్యాటింగ్​తోపాటు బౌలింగ్​లోనూ రాణించేవాళ్లు. అందువల్ల ఫేస్​బౌలర్లపై భారం తక్కువగా పడేది. ఆల్‌రౌండర్‌ హర్థిక్‌ పాండ్యా సైతం బౌలింగ్‌ చేసే పరిస్థితిలో లేడు. ఈ పరిణామం టీమిండియాకు ఇబ్బందికరంగా మారింది. టీంఇండియా ఫీల్డింగ్​ను మరింత మెరుగుపరుచుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Tags:    

Similar News