మల్లారెడ్డిని చెడుగుడు ఆడిన రేవంత్, కోమటిరెడ్డి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు.;
తెలంగాణ అసెంబ్లీలో మరోసారి ఆసక్తికర రాజకీయ వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు.
- మేడ్చల్ గ్రామాల అంశంపై మల్లారెడ్డి అభ్యంతరం
మేడ్చల్ సమీపంలోని కొన్ని గ్రామాలను జీహెచ్ఎంసీ పరిధిలోకి చేర్చకూడదని మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల గ్రామీణ పేద ప్రజలపై భారీగా పన్నుల భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ మల్లారెడ్డి కోరారు.
- హైదరాబాద్ బ్రాండ్.. మల్లారెడ్డి విమర్శలు
హైదరాబాద్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దిన కేసీఆర్, కేటీఆర్‌ను పొగడ్తలతో మల్లారెడ్డి అభివర్ణించారు. అయితే, ప్రస్తుతం హైదరాబాద్ 'హైడ్రా' పేరుతో దిగజారిపోయిందని.. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డేనని ఆయన ఆరోపించారు.
- రేవంత్ రెడ్డి కౌంటర్
మల్లారెడ్డికి చెడుగుడు ఆడిన రేవంత్ రెడ్డి "అదానీని తీసుకొచ్చి 100 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ స్థాపించేందుకు ప్రయత్నించామంటే హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు రచ్చ చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులు తెచ్చేందుకు మేం ప్రయత్నిస్తే, మీ నాయకులు అడ్డుకోవడం తప్ప ఇంకేం చేయలేదు" అని విమర్శించారు.
- కోమటిరెడ్డి సెటైర్లు
మల్లారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. "సభలో కామెడీ చేయకుండా, సమస్యలను సీరియస్‌గా తీసుకురావాలి. ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు వద్దు" అంటూ మల్లారెడ్డిని ఎద్దేవా చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఈ ఘటన మరోసారి అధికార – ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికయింది.