వైసీపీ సర్కార్ పై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంపై స్పందించిన బీఆర్ నాయుడు... రాజధాని రైతులు, మహిళలు కార్చిన కన్నీటిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు.;

Update: 2025-03-13 12:17 GMT

తాజాగా ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో రైతులతో బీఆర్ నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. అమరావతి రైతుల ఉద్యమం సక్సెస్ అయినందుకు మంగళగిరిలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో.. ఈ నెల 15న జరిగే శ్రీనివాస కళ్యాణంలో రైతులంతా పాల్గొనాలని కోరారు.

అవును... అమరావతి రైతులతో వెలగపూడిలో బీఆర్ నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అమరావతి రైతుల ఉద్యమం విజయవంతమైనందుకు మంగళగిరిలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక.. తాను రైతు బిడ్డను కాబట్టే రాజధాని రైతులకు అప్పట్లో మద్దతుగా నిలబడినట్లు బీఆర్ నాయుడు చెప్పుకొచ్చారు!

వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రకటన చేసిన సమయంలో ఓ మీడియా సంస్థ అధినేతగా రైతుల వెంట ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే.. జగన్ సర్కార్ తమపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసినా.. అమరావతి కోసం నిలబడ్డామని తెలిపారు. ఈ సందర్భంగా.. అమరావతి తిరిగి నిలబడినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంపై స్పందించిన బీఆర్ నాయుడు... రాజధాని రైతులు, మహిళలు కార్చిన కన్నీటిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. అమరావతి కోసం పోరాడిన రైతుల స్ఫూర్తి అభినందనీయమని తెలిపారు.

ఈ సమయంలో... బీఆర్ నాయుడిని రాజధాని ఐక్య కార్యచరణ సమితి తరుపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా... బీఆర్ నాయుడు వంటివారు అమరావతి ఉద్యమానికి అండగా నిలబడటంతోపాటు.. ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ హోదాలో రాజధానిలో శ్రీనివాస కల్యాణం నిర్వహించడంపై ఐకాస నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన టీటీడీ ఈవో శ్యామలారావు... శ్రీనివాస కళ్యాణం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 15 సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకూ శ్రీనివాస కల్యాణం జరుగుతుందని పేర్కొన్నారు. సుమారు 20 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

Tags:    

Similar News