వాన్స్ సాక్సులపై ట్రంప్ వెటకారం మామూలుగా లేదుగా?

అమెరికా అధ్యక్షుడు ఏ పని చేసినా నెట్టింట వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-03-13 11:30 GMT

అమెరికా అధ్యక్షుడు ఏ పని చేసినా నెట్టింట వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆగ్రహం, ఆయన నిర్ణయాలతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వస్త్రధారణ పైనా తాజాగా ట్రంప్ ట్రోలింగ్స్ వైరల్ గా మారాయి. ఈ సమయంలో ట్రంప్ టైమింగ్స్, ఆయన మార్క్ వెటకారం ఆసక్తిగా మారింది. అసలేం జరిగిందనేది ఇప్పుడు చూద్దామ్..!

అవును... ఐరిష్ ప్రధాని మైఖేల్ మార్టిన్ వైట్ హౌస్ ను తాజాగా సందర్శించారు. అనంతరం సెయింట్ పాట్రిక్స్ డే వార్షిక సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా... ట్రంప్, వాన్స్ తో ఓవల్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. ఈ సమయంలో.. ద్రవ్యోల్బణం గురించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడబోతూ హఠాత్తుగా వాన్స్ వేసుకొన్న సాక్స్ వైపు చూసి స్పందించారు.

ఈ సందర్భంగా... "ఈ సాక్స్ నాకు నచ్చాయి.. ఏమిటీ సాక్సులు" అని హఠాత్తుగా వాన్స్ ను ట్రోల్ చేశారు డొనాల్డ్ ట్రంప్. దీంతో.. వాన్స్ తో పాటు అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టారు. అనంతరం... "నేను ఏకాగ్రతగా ఉందామనుకొంటున్నాను.. వాన్స్ సాక్స్ లు నన్ను అట్రాక్ట్ చేశాయి" అని వ్యాఖ్యానించారు.

వాస్తవానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వస్త్రధారణ చాలాకాలంగా నెట్టింట ట్రోలింగ్ కు గురవుతోంది. గత నెల కూడా వాన్స్ డ్రెస్సింగ్ విధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 1700ల్లో నాటి ఇంగ్లిష్ వారు ధరించే తరహా డ్రెస్సింగ్ స్టైల్, స్టాకింగ్స్ ధరిస్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన భార్యకు సూచనలు చేస్తుంటారు. ఇందులో భాగంగా... కాస్త పొడవు ప్యాంట్లు, పిక్కలపైకి సాక్సులు ధరించాలని ఆమె వాన్స్ కు సూచించాలని చెబుతుంటారు. ఈ సమయంలో... తాజాగా నెటిజన్ల సరసన ట్రంప్ కూడా చేరారు.. జేడీ వాన్స్ వేసుకున్న సాక్స్ లపై ఆయనను ట్రోల్ చేశారు.

Tags:    

Similar News