బద్వేల్ లో ఉప ఎన్నిల పోరు ముగిసింది. పోలింగ్ శాతం కూడా 69 దాకా నమోదు అయింది. ఇది 2019 ఎన్నికల కంటే కూడా ఎనిమిది శాతం తక్కువ. నాడు 77 శాతానికి పైగా పోల్ అయితే వైసీపీకి 45 వేల దాకా మెజారిటీ వచ్చింది. మరి ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అన్నదే వైసీపీకి పట్టుకున్న టెన్షన్. బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీలో ఉంది. తెర వెనక టీడీపీ సాయం ఎంత ఉందనుకున్నా వైసీపీది ఏకపక్ష విజయమే. ఈ విషయంలో ఎలాంటి డౌట్లూ ఎవరూ పెట్టుకోనవసరం లేదు. అయితే వైసీపీ ఏకంగా లక్షకు పైగా మెజారిటీని కోరుతోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అయిదు లక్షలకు తగ్గకుండా మెజారిటీ అంటే అది కాస్తా సగానికి పడిపోయింది. నాడు కూడా పోలింగ్ శాతం బాతా తగ్గింది.
ఇపుడు కూడా బద్వేల్ లో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. సాధారణంగా ఉప ఎన్నిక అంటే ఎవరికీ ఉత్సాహం ఉండదు, పైగా టీడీపీ లాంటి ప్రధాన పార్టీ రేసులో లేదు. మరో వైపు చూస్తే ఎటూ వైసీపీయే గెలుస్తుంది కదా అన్న ఆలోచన కూడా ఓటర్లలో ఉంటుంది. దాంతో చాలా మంది ఓటర్లు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇష్టపడినట్లు లేదు. ఇంకో వైపు చూస్తే బద్వేల్ లో డబ్బులు పంచడం అన్నది కూడా ఎక్కడా పెద్దగా లేదు. దాంతో కూడా కొందరు ఓటింగునకు దూరమన్న ప్రచారం కూడా సాగింది. మరో వైపు అల్పపీడనం వల్ల వర్షం ముందు రోజు బాగా కురియడం, పోలింగ్ రోజు కూడా మబ్బు పట్టి ఉండడంతో రిస్క్ చేసి ఎందుకు పోలింగ్ బూతుల వద్ద క్యూ కట్టాలన్న ఆలోచనతో కూడా జనాలు రాలేదు అన్న మాట కూడా వినిపిస్తోంది.
ఇవన్నీ ఇలా ఉంటే ఏడాదికి లక్ష కోట్లకు తక్కువ కాకుండా సంక్షేమ పధకాలను జగన్ సర్కార్ అమలు చేస్తోంది. అప్పులు చేసి మరీ ప్రతీ ఇంటికీ నగదు బదిలీ పధకం అమలు చేస్తోంది. మరీ అంతలా చేసిన ప్రభుత్వానికి ఒక్క ఓటు వేయడానికి జనాలకు ఎందుకు బద్ధకం అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి టఫ్ ఫైట్ అయితే బద్వేల్ లో లేదు. బీజేపీ ఉనికి కోసం ఆరాటపడింది. ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయన్నది ఒక ఆసక్తి అయితే వైసీపీకి మెజారిటీ ఎంత అన్నదే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిస్కషన్. ఇక టీడీపీకి అయితే వైసీపీ మెజారిటీని 2019 కంటే కూడా బాగా తగ్గించాలని ఉంది. దాంతో కమలానికి కొంత ఫేవర్ చేసింది అంటున్నారు.
యినా సరే 69 శాతం పోలింగ్ జరిగింది అంటే మామూలు విషయం కాదనే అనుకోవాలి. ఇందులో దొంగ ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయంటూ అపుడే బీజేపీ విమర్శలు మొదలెట్టింది. ఇలా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే బద్వేల్ లో అధికార పార్టీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నదే తేలబోయే విషయం. బీజేపీని లైట్ తీసుకుని వైసీపీ కొంత తగ్గింది అన్న మాట ఉంది. ఇక వైసీపీ తెర వెనక వ్యూహాలు ఫలించి బీజేపీకి టీడీపీ ఓట్లు టర్న్ అయితే మాత్రం అనుకున్న మెజారిటీకి వైసీపీ దూరం కాక తప్పదు. అది అంతిమంగా జగన్ ప్రతిష్ట మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.