భ‌ర‌త్ వ‌స్తానంటే!... బాల‌య్య వ‌ద్ద‌న్నాడా?

Update: 2019-04-02 13:36 GMT
ఏపీ ఎన్నిక‌ల బ‌రిలో టీడీపీ స్టార్ క్యాంపెయినర్‌ - హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యం కూడా వైర‌ల్ అవుతోంది. బాల‌య్య‌తో పాటు ఆయ‌న పెద్ద‌ల్లుడు నారా లోకేశ్ - చిన్న‌ల్లుడు శ్రీ భ‌ర‌త్ కూడా ఈ సారి పోటీలోకి దిగిపోవ‌డంతో ఇప్పుడు బాల‌య్య‌ - ఆయ‌న అల్లుళ్ల గెలుపు అవ‌కాశాల‌పై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోందని చెప్పాలి. బాల‌య్య‌ - ఆయ‌న పెద్ద‌ల్లుడు అసెంబ్లీ బ‌రిలో నిలవ‌గా... చిన్న‌ల్లుడు ఏకంగా లోక్ స‌భ బ‌రిలోనే దిగేసిన సంగ‌తి తెలిసిందే. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో హిందూపురంలో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన బాల‌య్య ఈజీగానే గెలిచేశారు. అయితే ఆ త‌ర్వాత ఐదేళ్ల పాటు హిందూపురం ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా అందుబాటులో లేకుండా పోయిన బాల‌య్య... అక్క‌డ త‌న ప్ర‌తినిధిగా నియ‌మించుకున్న పీఏలు ఏకంగా తామే ఎమ్మెల్యేల‌మ‌న్న రీతిలో వ్య‌వ‌హ‌రించిన వైనం ఆస‌క్తి రేకెత్తించింది. అంతేకాకుండా ఏపీల ద్వారా బాల‌య్య స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌కు క‌మీష‌న్లు అందుతున్నాయ‌న్న విష‌యం కూడా పెద్ద ఎత్తున వైర‌ల్ అయ్యింది.

ఈ క్ర‌మంలో ఈ ద‌ఫా బాల‌య్య గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కేమీ కాద‌న్న వాద‌న వినిపించింది. త‌న గెలుపు కోస‌మే బాల‌య్య అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితిలో అల్లుళ్లిద్ద‌రూ బ‌రిలోకి దిగితే ప‌రిస్థితి ఏంట‌న్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఇలాంటి కీల‌క త‌రుణంలో బాల‌య్య చిన్న‌ల్లుడు శ్రీ భ‌ర‌త్ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన వైనం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. శ్రీ భ‌ర‌త్ పేల్చిన స‌ద‌రు వార్త ఇప్పుడు బాంబులాంటి వార్తే అయిపోయింద‌ని చెప్పాలి. అయినా భ‌ర‌త్ ఏమ‌న్నారన్న విష‌యానికి వ‌స్తే... తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటే... త‌న మామ‌య్య బాల‌య్య వ‌ద్ద‌న్నార‌ని భ‌ర‌త్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాక ఆ విష‌యాన్ని త‌న భార్య‌తో క‌లిసి బాల‌య్య వ‌ద్ద‌కు వెళ్లి ఈ విష‌యాన్ని ఆయ‌న‌కు చెప్పామ‌ని భ‌ర‌త్ చెప్పారు. అయితే రాజ‌కీయాల్లోకి రావ‌ద్ద‌ని బాల‌య్య సూచించార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌న‌ను రాజ‌కీయాల్లోకి వ‌ద్ద‌ని బాల‌య్య ఎందుకు చెప్పార‌న్న విష‌యాన్ని కూడా భ‌ర‌త్ వివ‌రించే య‌త్నం చేశారు.

చిన్న వ‌య‌సులో రాజకీయాల్లోకి వ‌స్తే... కుటుంబానికి స‌మ‌యం కేటాయించ‌డం కుద‌ర‌దన్న భావ‌న‌తోనే బాల‌య్య త‌న పొలిటిక‌ల్ ఎంట్రీని వారించార‌ని తెలిపారు. త‌న‌కు ఏడాది వయ‌సున్న కుమారుడిని దృష్టిలో పెట్టుకునే బాల‌య్య ఈ మాట చెప్పి ఉంటార‌ని కూడా భ‌ర‌త్ చెప్పుకొచ్చారు. అయితే పొలిటిక‌ల్ ఎంట్రీకి సంబంధించి తాను ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్ప‌గా... బాల‌య్య ఇక అడ్డు చెప్ప‌లేద‌ని భ‌ర‌త్ వివ‌రించారు. మొత్తంగా గ‌ట్టి నిర్ణ‌యం తీసుకోక‌పోతే... వెన‌క్కు త‌గ్గాల‌ని బాల‌య్య భావించార‌ని, అయితే తాను గ‌ట్టి నిర్ణ‌య‌మే తీసుకున్న వైనాన్ని తెలుసుకుని ప్రోత్స‌హించార‌ని భ‌ర‌త్ చెప్పుకొచ్చారు. ఇక త‌న సోద‌రుడు నారా లోకేశ్ గురించి కూడా ప్ర‌స్తావించిన భ‌ర‌త్‌... త‌న‌కున్న బ‌లాల్లో లోకేశ్ అతిపెద్ద బ‌ల‌మ‌ని కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ఇక త‌న‌పై పోటీకి దిగిన ద‌గ్గ‌రి బంధువు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ... బంధుత్వం, రాజ‌కీయాలు వేరువేర‌ని భ‌ర‌త్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News