బిగ్ బ్రేకింగ్... జమిలికి సంబంధించి మరో కీలక అడుగు!

ఇక మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం ఇక బీజేపీ తగ్గేదేలే అనే చర్చా తెరపైకి వచ్చింది.

Update: 2024-12-12 10:22 GMT

దేశ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశాల్లో జమిలి ఎన్నికల వ్యవహారం ఒకటనే సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం ఒక్కొక్క అడుగూ వేస్తోన్న నేపథ్యంలో.. ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల తర్వాత ఈ చర్చ మరింత బలంగా వినిపించింది. ఇక మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం ఇక బీజేపీ తగ్గేదేలే అనే చర్చా తెరపైకి వచ్చింది.

అంతకంటే మూందు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకూ అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో రూపొందించిన నివేదికను భారత రాష్ట్రపతికి ఈ ఏడాది మార్చిలో అందించారు. దీనికి కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ లో పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో మరో ముందడుగు పడింది.

అవును... జమిలి ఎన్నికలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో... జమిలి ఎన్నికలపై చర్చ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

దీనికి తోడు ఈ నెల 13, 14 తేదీల్లో సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ ఎంపీలకు భారతీయ జనతాపార్టీ విప్ జారీ చేసింది. దీంతో.. ఈ సమావేశాల్లోనే, ఆ రెండు రోజుల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

మరోవైపు... ఈ జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే... దేశంలో నిత్యం ఎడో ఒకచోట ఎన్నికలు జరుగుతుండటం వల్ల అభివృద్ధి కుంటిపడుతుందంటూ కేంద్రం చెప్పుకొస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. దీనికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా... జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ పంచజెండా ఊపిన సమయంలో స్పందించిన ప్రధాని మోడీ.. ఈ పరిణామాన్ని.. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తిమంతంగా, భాగస్వామ్యయుతంగా మార్చే కీలక ముందడుగుగా పేర్కొన్నగా.... జమిలి అసాధ్యం అంటూ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News