కేటీఆర్ కు ఒంట్లో బాగోలేదంట

Update: 2015-10-25 06:33 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. మంత్రి కేటీఆర్ ఆరోగ్యం బాగోలేదు. ఈ విషయాన్ని ఎవరో కాదు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించారు. ఆదివారం ఉదయం  కేబీఆర్ పార్క్ లో ఒక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొనాల్సి ఉంది.

అయితే.. బాలకృష్ణ మాత్రమే హాజరయ్యారు. పింక్ రిబ్బన్ వాక్ పేరిట  కేన్సర్ మీద అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనాల్సిందిగా కోరితే.. వెంటనే ఓకే చెప్పారని.. కాకుంటే ఆయన ఆరోగ్యం బాగో లేకపోవటంతో కార్యక్రమానికి రాలేకపోయారని బాలకృష్ణ చెప్పకొచ్చారు. ఇంతకీ కేటీఆర్ హెల్త్ కి ఏమైంది..?
Tags:    

Similar News