తాజాగా గ్రేటర్ ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీ, టిఆర్ ఎస్ , ఎంఐఎం పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఇక ఫలితాల్లో కారు జోరుకి బ్రేకులు పడ్డాయి. కమలం వికసించింది. కాంగ్రెస్ సింగల్ డిజిట్ కే పరిమితం కాగా , టీడీపీ గ్రేటర్ లో అసలు ఖాతా తెరవలేదు. ఇదిలా ఉంటే ..తాజాగా మానస రీసెర్చ్ హెల్త్ కేర్ సర్వే లో దేశంలోనే ఆరో ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్ గా హైదరాబాద్ లోని బసవతారకమ్మ కాన్సర్ హాస్పిటల్ ఎన్నుకోబడింది.
దీనిపై స్పందిస్తూ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ తమ ఆనందం వ్యక్తం చేశారు. బసవతారకం హాస్పిటల్ కి వచ్చిన అవార్డు ల ప్రోత్సహం తో మేము మరిన్ని సేవలు అందించే ప్రయత్నం చేస్తాము అని నందమూరి బాలకృష్ణ చెప్పారు. బాలయ్య మాట్లాడుతూ... నిరుపేదల వై ద్యం కోసం 3కోట్ల రూపాయలు ట్రస్ట్ కు కేటాయించాము. మన హాస్పిటల్ కు 6వ ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. 2011లో 13 వ స్థానం నుంచి 2020నాటికి 6 వ స్థానానికి చేరుకున్నాం.
దీనిని మొదటి స్థానానికి తీసుకెళ్లడానికి కృషి చేస్తాను. అధునాతన పరికరాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో బసవతారకం హాస్పిటల్ సేవలు అందిస్తుంది అని తెలిపారు. ఈ సందర్బంగా గ్రేటర్ ఎన్నికల ఫలితాల గురించి ప్రశ్నించగా... హైదరాబాద్ రాజకీయాల పై నో కామెంట్, ఈ రోజు రాజకీయాల పై మాట్లాడను అని చెప్పాడు.