ఎమ్మెల్యే కం సినీ నటుడు బాలయ్య తన అల్లుల్లు ఇద్దరినీ రాజకీయంగా క్రియాశీలంగా మార్చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద అల్లుడు నారాలోకేష్.. తండ్రి చంద్రబాబు అండతో ఏపీ ప్రభుత్వంలో నంబర్ 2గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రెండో అల్లుడు భరత్ ను కూడా లాంచ్ చేసే పని వేగంగా సాగుతోంది.
ప్రస్తుతం భరత్ విశాఖ ఎంపీ సీటుపై కన్నేశారు. బాలయ్య రెండో అల్లుడు భారత్ ది కూడా రాజకీయ కుటుంబమే.. ఆయన తాత ఎమ్ వీవీఎస్ మూర్తి గతంలో టీడీపీ ఎంపీగా చేశారు. ఎమ్మెల్సీగా ఉంటూనే చనిపోయారు. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేసే పనిలో భరత్ అడుగులు వేస్తున్నారు. అయితే విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు భరత్ కు అడ్డంకిగా మారాయి. ఈ నియోజకవర్గంలో బీసీ, కాపు ఓట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో కమ్మ సామాజిక వర్గం అయిన భరత్ కు ఇది అశానిపాతంగా మారాయి. అందుకే భరత్ ను కాకుండా ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి గంటాను రంగంలోకి దింపాలని బాబు యోచిస్తున్నారు..
గంటాకు కాపుతోపాటు కమ్మ సామాజికవర్గంతో కూడా బంధుత్వం ఉంది. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని విశాఖకు వాడుకోవాలని టీడీపీ స్కెచ్ గీసింది. అదే సమయంలో బాలయ్య చిన్నల్లుడిని నొప్పించకుండా ఆయన తాత విడిచిన ఎమ్మెల్సీ సీటును ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.
లోకేష్ బాబు ఈసారి ఎలాగూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు రెండో అల్లుడు భరత్ కూడా టీడీపీలో ఎమ్మెల్సీ అయితే బాలయ్య హ్యాపీగా ఉంటారు. అల్లుల్లిద్దరూ టీడీపీలో చక్రం తిప్పడం మామకు అంతకుమించిన ఆనందం వేరే ఏముంటుందని టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.