బాల‌య్య రెండో అల్లుడు కూడా దిగిపోతున్నాడే!!

Update: 2018-09-27 14:45 GMT
వార‌స‌త్వ రాజ‌కీయాల్లో భాగంగా మ‌రో నాయ‌కుడు తెర‌మీద‌కు రానున్నారు. ఇప్ప‌టికే ప‌ల‌వురు ముఖ్య‌నేతలు అరంగేట్రం చేసిన నంద‌మూరి కుటుంబం నుంచి ఇంకో నాయకుడి ఎంట్రీ ఖ‌రారైంద‌ని తెలుస్తోంది. ఆయ‌నే నంద‌మూరి బాల‌కృష్ణ రెండో అల్లుడు భర‌త్. గీతం విద్యాసంస్థ‌ల అధినేత ఎంవీఎస్ మూర్తి మ‌నుమ‌డైన భ‌ర‌త్‌ను రాబోయే ఎన్నిక‌ల్లో ఎంపీగా బ‌రిలో దింప‌నున్నార‌ని వార్త‌లు గుప్పుమంటున్నాయి. త‌న తాత మూర్తి గ‌త ఎన్నిక‌ల్లో త్యాగం చేసిన విశాఖ‌ప‌ట్ట‌ణం పార్ల‌మెంటు స్థానం నుంచి భ‌ర‌త్ రంగంలోకి దిగ‌నున్నార‌ని అంటున్నారు.

బీజేపీ- టీడీపీ పొత్తులో భాగంగా గ‌త ఎన్నిక‌ల్లో కంభంపాటి హ‌రిబాబు విశాఖ పార్ల‌మెంటు నుంచి బ‌రిలో దిగి గెలుపొందారు. ఇప్పుడు ఈ రంఎడు పార్టీల మ‌ధ్య పొత్తులేని నేప‌థ్యంలో అభ్య‌ర్థుల అన్వేష‌ణ మొద‌లైంద‌ని, ఇందులో భాగంగా భ‌ర‌త్ తెర‌మీద‌కు వ‌చ్చార‌ని అంటున్నారు. త‌న తాత‌కు ఉన్న రాజ‌కీయ నేప‌థ్యంలో, త‌న మామ బాల‌కృష్ణ కోటా రూపంలో టికెట్ సంపాదించుకునేందుకు ఈజీ కావ‌డంతో భ‌ర‌త్ పోటీ చేసేందుకు సై అంటున్న‌ట్లు చెప్తున్నారు. అయితే, ఆయ‌న‌కు ఇంకా టికెట్ ఖ‌రారు కాలేద‌ని, అవుతుంద‌నే ఖ‌చ్చిత‌మైన న‌మ్మ‌కం  కూడా లేదంటున్నారు.

త‌న బావ‌మ‌రిది, వియ్యంకుడు అయిన బాల‌య్య అల్లుడు అయిన‌ప్ప‌టికీ టికెట్ ఖ‌రారు విష‌యంలో  చంద్ర‌బాబుదే తుది నిర్ణ‌య‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. భ‌ర‌త్ ఆస‌క్తిని భ‌విష్య‌త్‌లో చంద్ర‌బాబు చేర‌వేస్తే ఆయ‌న ఒప్పుకుంటారా?  లేక నో చెప్తారా అనే దాని ఆధారంగా భ‌ర‌త్ ఎంట్రీ ఉండ‌నుంద‌ని అంటున్నారు. ఇంకొద్ది కాలం గ‌డిస్తే కానీ..ఈ టికెట్ విష‌యంలో సూర్తి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేమ‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News