సినీ హీరో, టీడీపీ స్టార్ క్యాంపెయినర్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ దురుసు వర్తనపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. తన సొంత నియోజకవర్గంతో పాటు టీడీపీ స్లార్ క్యాంపెయినర్ హోదాలో ఎక్కడికెళ్లినా... బాలయ్య ఎంతమాత్రం ఊరుకోవడం లేదు. చేతికి అందిన దానితో అభిమానులపై విరుచుకుపడటంతో పాటు పరుగెత్తించి మరీ ఆయన కొడుతున్న తీరుపై సో్షల్ మీడియా ఊగిపోతోందనే చెప్పాలి. ఇదెక్కడి గోలరా బాబూ అని అభిమానులు తలలు పట్టుకుంటూ ఉంటే.. బాలయ్య ఎక్కడ తన కొంప ముంచుతాడోనని పార్టీ చీఫ్ చంద్రబాబు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగానే కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్యకు మంచి అండే దొరికింది. ఆ అండ వేరెవరి నుంచో కాదండోయ్... స్వయానా తన సతీమణి నందమూరి వసుంధరా దేవి నుంచే. భర్త గెలుపు కోసం ఏకంగా హిందూపురంలోనే తిష్ట వేసిన వసుంధర... బాలయ్య కంటే కూడా మరింతగా కష్టపడుతున్నారు. భర్త గెలుపు కోసం పాటుపడుతూ వసుంధర వార్తల్లో నిలుస్తుంటే... బాలయ్య మాత్రం తన దురుసు ప్రవర్తనతోనే వార్తల్లో నిలుస్తున్నారు. బాలయ్య వార్తలు.. ఆయన ప్రచారంపై కాకుండా ఆయన దురుసు వర్తనపై మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో బాలయ్యను వెనకేసుకుని వస్తూ వసుంధర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయని చెప్పాలి. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె బాలయ్య గురించి చాలా విషయాలే చెప్పారు. అంతేకాకుండా బాలయ్య అభిమానులపై విరుచుకుపడుతున్న తీరుపైనా స్పందించారు.
అభిమానులపై ప్రేమతోనే బాలయ్య వారిని కొడుతుంటారని కూడా ఆమె ఓ రూలింగ్ ఇచ్చారు. అభిమానులతో ఉన్న చనువు కారణంగానే బాలయ్య వారిపై అలా ప్రవర్తిస్తారని వసుంధర చెప్పుకొచ్చారు. అయినా వార్తల్లో వచ్చినట్టుగా బాలయ్య ప్రవర్తనపై ఆయన అభిమానులేమీ పెద్దగా బాధ పడరని, అభిమానులు కూడా బాలయ్య ప్రవర్తన గురించి ేమీ అనుకోరని, బాలయ్య అలా చేయడం వారికి కూడా సంతోషంగానే ఉంటుందని కూడా ామె ఓ కొత్త విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. గిట్టని వాళ్లు మాత్రమే బాలయ్య ప్రవర్తనపై నానా యాగీ చేస్తుంటారని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా ఆమె ఏమన్నారంటే... ‘ పేద ప్రజలు కష్టాల్లో ఉంటే బాలయ్య తట్టుకోలేరు. అందుకు ఉదాహరణ బసవతారకం ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి హిందూపురం నుంచి కానీ - ఫ్యాన్స్ కానీ, పేదవారు ఎవరు వచ్చినా ఎవరికీ ట్రీట్ మెంట్ నిరాకరించారు. బసవతారకం ఆసుపత్రికి వచ్చేవారి వద్ద డబ్బు ఉన్నా, లేకపోయానా... వైద్యం చేస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వారి వైద్యానికి సహాయం అందేలా చేస్తారు. విదేశాలకు వెళ్లి నిధులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు ఆసుపత్రిలో సింగిల్ పేషంట్ కు కూడా వైద్యం నిరాకరించలేదు‘ అని ఆమె తనదైన శైలిలో చెప్పుకుంటూ పోయారు. అయినా బాలయ్య దురుసు వర్తనకు - బసవతారకం ఆసుపత్రికి ఏం సంబంధమో వసుంధరే చెప్పాలన్న వాదన వినిపిస్తోంది.