నందమూరి బాలకృష్ణ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తాడా చేయడా అనే విషయంలో స్పష్టత వచ్చేసింది. ఆయన ప్రచారానికి రావట్లేదు. తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి స్టార్ క్యాంపైనర్ల లిస్టు తాజాగా బయటికి వచ్చింది. అందులో బాలయ్య పేరు లేదు. బాలయ్యే కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ప్రచారానికి రారని తేలిపోయింది. రాహుల్ తో కలిసి బాబు రోడ్ షోలు చేస్తారంటూ ఇంతకుముందు ప్రచారం జరిగింది కానీ.. తన ప్రచారం వల్ల అభ్యర్థులకు కలిగే లాభం కంటే తనకు సొంతంగా జరిగే నష్టమే ఎక్కువని భావించి ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య విషయానికి వస్తే.. ఆయన్ని ప్రచారానికి రావలంటూ చాన్నాళ్ల కిందటే తెలుగుదేశం నేతలు కోరారు. అప్పటికి చూద్దాంలే అన్నాడు. ఇటీవల బాలయ్య తెలంగాణలో ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని.. తెలుగుదేశం పార్టీకి కేటాయించిన అన్ని స్థానాల్లో ప్రచారం ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ అదేమీ లేదని తేలింది. మహా అయితే సుహాసిని పోటీ చేస్తున్న కూకట్ పల్లి వరకు బాలయ్య ప్రచారం నిర్వహించే అవకాశముంది.
మిగతా స్థానాల విషయానికి వస్తే బాలయ్య ప్రచారం వల్ల లాభం జరుగుతుందో లేదో కానీ.. నష్టం తప్పదేమో అని అభ్యర్థులు భయపడుతున్నారట. మైకు అందుకుంటే బాలయ్య ఏం మాట్లాడతాడో తెలియదు. ఈ మధ్య తరచుగా ఆయన నోటిలో బూతులొచ్చేస్తున్నాయి. మాట తడబాటుతో తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాడు. పైగా తనను తాను అదుపు చేసుకోలేక అభిమానులపై చేయి చేసుకోవడం.. లాంటివి చేస్తుంటాడు. ఆ మధ్య ఖమ్మం వెళ్లి ఇలాగే శ్రుతి మించాడు. ఇలాంటివి ఏమైనా ఎన్నికల ప్రచారంలో జరిగితే డ్యామేజ్ మామూలుగా ఉండదు. అభ్యర్థులు మునిగిపోతారు. అందుకే బాలయ్య రాకపోవడమే మంచిదని అభ్యర్థులతో పాటు మహా కూటమి పెద్దలు డిసైడయ్యారట.