ఈసారి బాలాపూర్ లడ్డూ రూ.14,65,000

Update: 2016-09-15 05:59 GMT
వినాయకచవితి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది గణేశ్ మండపాలు ఏర్పాటు చేస్తుంటారు. ఎక్కడ ఎన్ని మండపాలు ఏర్పాటు చేసినా.. హైదరాబాద్ లోని బాలాపూర్ మండపం తీరు వేరు. బాలాపూర్ లో ఏర్పాటు చేసే వినాయక మండపంలో చివరి రోజున నిర్వహించే లడ్డూ ప్రసాదాన్ని వేలం వేస్తారు. ఈ వేలంలో లడ్డూను దక్కించుకోవటానికి భారీ ఎత్తున పోటీ నెలకొని ఉంటుంది. ప్రతిఏటా పోటాపోటీగా సాగే ఈ లడ్డూ వేలం తెలుగు రాష్ట్రాల ప్రజల్ని అమితంగా  ఆకర్షిస్తోంది.

బాలాపూర్ లడ్డూను దక్కించుకోవటం అంటే అదో అదృష్టంగా భావిస్తుంటారు. అందుకు తగ్గట్లీ ఈసారి లడ్డూ వేలం భారీ ఎత్తున సాగింది.లడ్డూను సొంతం చేసుకోవటానికి 25 మంది భక్తులు పోటీ పడ్డారు. ఈ పోటీలో పాల్గొన్న వారంతా లడ్డూను సొంతం చేసుకోవటానికి విపరీతంగా ప్రయత్నించారు. గత ఏడాది రూ.10.32 లక్షలుపలికిన ఈలడ్డూ ఈసారి ఏకంగా రూ.14,65,00 పలకటం గమనార్హం. గత ఏడాది కంటే ఏకంగా రూ.4.33లక్షలు ఎక్కువ ధర పలికింది.

బాలాపూర్ లడ్డూను దక్కించుకోవటాన్ని అదృష్టంగా భావించటమే కాదు.. ఆ లడ్డూను సొంతం చేసుకున్న వారికి అంతా కలిసి వస్తుందన్న నమ్మకం ఉంది. తాజాగా బాలాపూర్ లడ్డూను స్కైలాబ్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూను సొంతం చేసుకోవటానికి కొన్నేళ్లుగా తాను ప్రయత్నిస్తున్నానని.. ఈసారి తనకా అవకాశం దక్కిందని మురిసిపోతున్నారు స్కైలాబ్ రెడ్డి. బాలాపూర్ లడ్డూకు పలికిన ధర ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Tags:    

Similar News