మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కు పగ్గాలు అప్పజెప్పడానికి టీడీపీ కానీ.. చంద్రబాబు కానీ.. ఆయన బాబాయి బాలక్రిష్ణ కానీ సిద్ధంగా లేరని అర్థమైంది. చంద్రబాబు ఒకవేళ వృద్ధాప్యంతో తప్పుకుంటే తనను బాధ్యతలు తీసుకోమంటే ఖచ్చితంగా తీసుకుంటానని హీరో కం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కుండబద్దలు కొట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక న్యూస్ చానెల్ తో మాట్లాడిన బాలయ్య పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలన్న డిమాండ్ పై ఆసక్తికరంగా స్పందించారు.
ఇటీవల టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వాలన్న కార్యకర్తల డిమాండ్ పై ఏ విధంగా స్పందిస్తారన్న ప్రశ్నకు బాలయ్య ఫ్రీజ్ అయిపోయారు. రెండు మూడు నిమిషాలు మౌనంగా ఉగూతూ ఉండిపోయారు. చాలా సేపు ఆలోచించి చివరకు ‘ఎవరు తోచినట్లు వారు కోరుకోవడంలో తప్పు లేదని.. ఫలానా వారు పార్టీ పగ్గాలు తీసుకోవాలని అభిమానులు కోరుకోవడంలో కూడా తప్పు లేదని.. కానీ కేవలం సినిమా హీరో కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పగ్గాలు తీసుకోవాలనుకోవం సబబు కాదని’ ఎన్టీఆర్ కు పగ్గాలు కరెక్ట్ కాదని చెప్పకనే చెప్పారు బాలయ్య..
అయితే ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు ఇస్తే పార్టీకి ప్లస్ అవుతుందా? అన్న ప్రశ్నకు చాలా సేపు ఆలోచించారు. గట్టిగా నవ్వారు. సేద తీరి ఆన్సర్ చేశారు. ‘అది ప్లస్ అవ్వచ్చు. మైనస్ అవ్వచ్చు. ప్లస్ అయ్యి మైనస్ అవ్వొచ్చు. మైనస్ అయ్యి ప్లస్ అవ్వొచ్చు’ అంటూ ప్రశ్నించిన జర్నలిస్ట్ కు అర్థంకాకుండా దిమ్మదిరిగేలా బాలయ్య సమాధానం ఇచ్చారు.
ఒక వేళ చంద్రబాబుకు అనుకోని పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు ఇస్తే తీసుకుంటారా? అంటే ‘నిజంగా అలాంటి సందర్భం వస్తే పార్టీ పగ్గాలు తీసుకోవడానికి వెనుకాడనని.. ఆ సమర్థత తనకు ఉందని.. అందుకు బలమైన సందర్భం రావాలని బాలయ్య అన్నారు. అయితే తాను ఎప్పుడూ పార్టీ పగ్గాలు ఇవ్వాలని చంద్రబాబును కోరలేదని.. అలా అడిగే వ్యక్తిత్వం తనది కాదని బాలయ్య వ్యాక్యానించారు.