టీఆర్ ఎస్ పార్టీ శాసనసభా పక్షా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ సంచలన ఆరోపణలు చేశారు. కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ అని రుజువు అయిందని ఆరోపించారు. 2016 జూలై 16 - 27 తేదీల్లో కోదండరాం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారని బాల్క సుమన్ తెలిపారు. ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి - సుషీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన అమరేందర్ రెడ్డి లతో పాటు కోదండరాం సోనియాను కలిశారని తెలిపారు. సోనియాను కోదండరాం రహస్యంగా కలవాల్సిన అవసరమేమొచ్చిందని నిలదీశారు. కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ అని మొదట్నుంచీ తాము చెబుతూ వస్తున్నామని అదే రుజువు అయిందని అన్నారు.
సోనియా గాంధీని కలిసిన తర్వాతనే కోదండరాం మల్లన్న సాగర్ ఆందోళనల్లో పాల్గొన్నారని బాల్క సుమన్ ఆరోపించారు. ప్రతి వేదిక మీద ప్రభుత్వాన్ని విమర్శించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కోదండరాం తెలంగాణ ద్రోహి అని - కాంగ్రెస్ పార్టీ శిఖండి రాజకీయాలు మానుకుంటే మంచిదన్నారు. దమ్ముంటే నేరుగా మమ్మల్ని ఎదుర్కోండని సవాల్ విసిరారు. కోదండరాం జేఏసీ ,మేధావి ముసుగులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా పని చేసే బదులు కోదండరాం ఆ పార్టీ కండువా కప్పుకుంటే మంచిదని బాల్క సుమన్ సూచించారు. కోదండరాం ఢిల్లీలొనే కాదు హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ - కాంగ్రెస్ అగ్రనేతలు కోమటిరెడ్డి - జైపాల్ రెడ్డిలను కూడా తరచూ కలుస్తున్నారని ఆరోపించారు. తనకు పదవులు - అధికారం మీద వ్యామోహం లేదంటున్న కోదండరాం కాంగ్రెస్ కపట నాటకం లో సూత్రధారి గా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు కోదండరాం పనిచేస్తున్నారని విమర్శించారు. కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడని దుయ్యబట్టారు. మల్లన్న సాగర్ పై కావాలనే రైతులను రెచ్చగొడుతున్నాడని బాల్క సుమన్ మండిపడ్డారు. ఓ వైపు రాజకీయాలొద్దంటూనే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ తో కోదంరాంకు సంబంధాలున్నాయని అన్నారు. కత్తి వెంకటస్వామి - అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించింది నిజం కాదా? అని సుమన్ ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/