ఇడియట్ అంటూ నోరుజారాడు.. దీంతో ఎలన్ మస్క్ కే కౌంటరిచ్చాడు
స్పేస్‌ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్, డెన్మార్క్‌కు చెందిన సీనియర్ వ్యోమగామి యాండీ మోగెన్సెన్ మధ్య ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాటల యుద్ధం నడిచింది.
ప్రపంచంలోనే కుబేరుడు, స్సేస్ ఎక్స్ సంస్థ ఓనర్ ఎలన్ మస్క్ ఏ విమర్శను సామరస్యంగా తీసుకోవడం లేదు. ట్రంప్ ను గెలిపించాక కాస్తంత దూకుడు పెరిగింది. ఎవరైనా ప్రశ్నిస్తే చాలు మీదపడిపోతున్నాడు. ఏకంగా ఓ సీనియర్ వ్యోమగామిని పట్టుకొని ‘ఇడియట్’ అంటూ తిట్టేశాడు. దీనికి ఆ సీనియర్ వ్యోమగామి గట్టి పంచ్ ఇవ్వడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల విషయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, స్పేస్‌ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్, డెన్మార్క్‌కు చెందిన సీనియర్ వ్యోమగామి యాండీ మోగెన్సెన్ మధ్య ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాటల యుద్ధం నడిచింది. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఓ టీవీ ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ, వ్యోమగాములు ఇంకా నింగిలోనే ఉండిపోవడానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కారణమని ఆరోపించారు. రాజకీయ కారణాల వల్లనే వారిని తిరిగి భూమికి తీసుకురాలేదని మస్క్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై వ్యోమగామి యాండీ మోగెన్సెన్ తీవ్రంగా స్పందించారు. మస్క్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని, వ్యోమగాములను భూమికి తీసుకురావడానికి గత సెప్టెంబర్‌లోనే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలిపారు.
- ఇడియట్ అంటూ మస్క్ కౌంటర్
యాండీ చేసిన ఈ ట్వీట్‌పై మస్క్ తీవ్ర స్థాయిలో స్పందించారు. "ఇడియట్... నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. వ్యోమగాములు సునీత, విల్మోర్‌లను తీసుకురావడానికి నేను చాలా నెలల క్రితమే ప్రయత్నాలు మొదలుపెట్టాను. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల బైడెన్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు" అంటూ ఘాటుగా స్పందించారు.
-యాండీ ప్రతిస్పందన
మస్క్ వ్యాఖ్యలపై తిరిగి స్పందించిన యాండీ, "ఇలాన్, నువ్వంటే నాకు అభిమానం. టెస్లా, స్పేస్‌ఎక్స్‌లో నువ్వు సాధించిన విజయాలను ప్రశంసిస్తా. ఇది నీకు కూడా తెలుసు. అయితే సునీత, విల్మోర్‌ల విషయమై నువ్వు చేస్తున్న ఆరోపణలు నిజం కావు. వారిని భూమికి తీసుకురావడానికి గత సెప్టెంబర్ నుంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి" అంటూ పేర్కొన్నారు.
-మస్క్-బైడెన్ మధ్య పొలిటికల్ వైరం?
ఇలాన్ మస్క్ గత కొంత కాలంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. స్పేస్ ఎక్స్, నాసా సంబంధాలు, ప్రభుత్వ నిధుల విషయాల్లో కూడా మస్క్, బైడెన్ మధ్య సంబంధాలు కొంత మందకొడిగా ఉన్నట్లు అనిపిస్తోంది. వ్యోమగాముల తిరిగి భూమికి రాకలో రాజకీయ కారకాలు ముడిపడి ఉన్నాయా? లేదా మస్క్ ఆరోపణలు వాస్తవమా? అనే ప్రశ్నలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.