ఫ్లాట్ లో బెడ్ కింద మహిళ మృతదేహం.. ఇంటి ఓనర్ అరెస్ట్

భర్త ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది చూసి భార్య భరించలేకపోయింది.;

Update: 2025-03-31 14:30 GMT
ఫ్లాట్ లో బెడ్ కింద మహిళ మృతదేహం.. ఇంటి ఓనర్ అరెస్ట్

భర్త ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది చూసి భార్య భరించలేకపోయింది. ఇలాంటి మొగుడితో సంసారం చేయలేనంటూ పంజాబ్ లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఢిల్లీలో ఉంటున్న భర్త కొద్దిరోజులకు భార్యను బతిమాలి బామాలి ఢిల్లీలోని తన ఫ్లాట్ కు తీసుకొచ్చాడు. కానీ ఏం జరిగిందో కానీ భార్య శవమై తేలింది.

తూర్పు ఢిల్లీలోని ఓ ఇంట్లో మంచం కింద పెట్టెలో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇంటి యజమాని కూడా ఉన్నారు. మృతురాలి భర్త సహాయకుడిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన తర్వాత భర్త పరారీలో ఉన్నాడు.

వివేకానంద మిశ్రా అనే ఇంటి యజమానిని శుక్రవారం అదుపులోకి తీసుకోగా శనివారం అరెస్టు చేశారు. అనంతరం జరిగిన విచారణలో మిశ్రా నేరాన్ని అంగీకరించడంతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు చెప్పాడు. వారిలో మృతురాలి భర్త ఆశిష్ , అతని స్నేహితుడు అభయ్ కుమార్ ఉన్నారు. అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, భర్తను అదుపులోకి తీసుకున్న తర్వాతే నేరానికి గల అసలు కారణం తెలిసిందని పోలీసులు తెలిపారు.

శుక్రవారం ఢిల్లీ పోలీసులకు వివేక్ విహార్‌లోని ఓ ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా, ఇంటి వెనుక తలుపు వద్ద రక్తపు మరకలు కనిపించాయి. ఇల్లు బయటి నుండి తాళం వేసి ఉంది. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా మంచం కింద పెట్టెలో దుప్పటిలో చుట్టిన కుళ్లిపోయిన మృతదేహం కనిపించింది. ఆ తర్వాత రాత్రి పోలీసులు 65 ఏళ్ల ఇంటి యజమానిని ఆనంద్ విహార్‌లోని సూరజ్‌మల్ పార్క్ సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., 35 ఏళ్ల బాధితురాలు అంజలి తన భర్త మరో ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం కలిగి ఉండటాన్ని ఢిల్లీలోని వారి ఫ్లాట్‌లో చూసింది. భర్త వ్యవహారం గురించి తెలుసుకున్న తర్వాత ఆమె ఇంటి నుండి పంజాబ్‌లోని లుధియానాలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. మార్చి 21న ఆమె భర్త ఆశిష్ ఆమెను తిరిగి ఢిల్లీకి రప్పించాడు. రెండు రోజుల తర్వాత అతను తన స్నేహితుడు.. వారి ఇంటి యజమానితో కలిసి ఆమెను హత్య చేసి.. మృతదేహాన్ని మంచం కింద పెట్టెలో దాచి జైపూర్‌కు పారిపోయారు. అక్కడ ఆశిష్ తన బంధువుల ఇంట్లో ఉన్నారు. ఇంటి యజమాని తిరిగి ఢిల్లీకి రాగా, ఆశిష్ , అతని స్నేహితుడు అభయ్ బీహార్‌కు పారిపోయారు.

ముగ్గురు వ్యక్తులు మృతదేహాన్ని ఎలా ఒదిలించుకోవాలో తెలియక సతమతమయ్యారు. మార్చి 28న దుర్వాసన గురించి పోలీసులకు ఫోన్ రావడంతో నేరం బయటపడింది. వారి ప్రణాళిక విఫలమైంది.

Tags:    

Similar News