తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై అధికార టీఆర్ ఎస్ పార్టీ మరోమారు విమర్శలు గుప్పించింది. గులాబీ దళపతి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ మరోమారు కోదండరాంపై ఒంటికాలిపై లేచారు. రాష్ట్రాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ ఆలోచిస్తుంటే..ప్రజా తిరస్కరణకు గురైన కాంగ్రెస్ - టీడీపీలను ఎలా బతికియ్యాలని కోదండరాం చూస్తున్నారని మండిపడ్డారు. కోదండరాం కాంగ్రెస్ కోవర్టు అని ఆరోపిస్తూ ఆయనను ముందుంచి కాంగ్రెస్ శిఖండి రాజకీయాలు చేస్తున్నదని తెలిపారు. కోదండరాం చేస్తున్న నీతిమాలిన పనులను టీఆర్ ఎస్ నిలదీయగానే కాంగ్రెస్ - టీడీపీలు ఎగిసిపడుతుండటాన్ని ఏమనుకోవాలని నిలదీశారు.
"అసలు కోదండరాం ఎవరు. ఆయన జేఏసీ చైర్మన్ కాకముందు నాకే తెల్వదు. నాకు విద్యార్థి సంఘం బాధ్యతలు అప్పగించినట్టే...కోదండరాంకు ఒక బాధ్యతను అప్పగించారు. ఆయనని జేఏసీ చైర్మన్ చేసిందే కేసీఆర్. కోదండరాం 2003లో విద్యావంతుల వేదికలో ఎక్కడో ఓ మూలన ఉన్నారు. "అని బాల్క సుమన్ తెలిపారు. అమెరికా ఉద్యోగం.. నెలకు నాలుగైదు లక్షల రూపాయల జీతం.. ప్రశాంత జీవనం.. ఇలా అన్నింటినీ వదులుకొని పుట్టినగడ్డ రుణం తీర్చుకోవడానికి మంత్రి కేటీఆర్ ఇక్కడికి వచ్చారని బాల్క సుమన్ గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో అందరితోపాటు ఆయన కూడా లాఠీ దెబ్బలు తిన్నారని - ధర్నాలు - రాస్తారోకోలులో పాల్గొన్నారని బాల్క సుమన్ గుర్తుచేశారు. అందుకే ప్రజలు ఆయనను మూడుసార్లు గెలిపించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ రూపకర్త జయశంకర్ సార్ పేరిట జిల్లా ఏర్పాటు చేసినా.. ములుగులో వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొన్న కోదండరాం ఎక్కడ టెంట్ వేసినా అక్కడికి వెళ్లి ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి పనులు ఆయనకు కనిపించడం లేదా అని బాల్క సుమన్ నిలదీశారు.
ఒక సందర్భంలో ఉద్యమాన్ని హింసవైపు మళ్లించడానికి కోదండరాం ప్రయత్నించారని, కానీ కేసీఆర్ దాన్ని గుర్తించి నిలువరించారని, ఇలా అనేక విషయాలు బయటకు చెప్పలేనివి ఉంటాయని బాల్క సుమన్ తెలిపారు. రేవంత్ రెడ్డి కీచు గొంతు వేసుకుని ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మరని, ప్రజాప్రతినిధులను డబ్బులతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన గజదొంగ రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు ఆశపడి కుక్కలా మొరుగుతున్నాడని మండిపడ్డారు. ఉద్యమంలోకి కేటీఆర్ సామాన్య కార్యకర్తగా వచ్చారని, ఆయన రాకను కేసీఆర్ చాలాసార్లు అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు. రేవంత్ రెడ్డి టీఆర్ ఎస్ పార్టీలో చిన్న పదవి ఇవ్వలేదని టీఆర్ ఎస్ ను వదిలిపెట్టాడని మండిపడ్డారు. ఇప్పుడు కేటీఆర్ ను విమర్శించే వారంతా ఆనాడు ఏసీ కార్లలో తిరిగారని గుర్తుచేశారు. కోదండరాం ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ విలన్ గా నిలుస్తారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కోదండరాం మంచి డ్రైవరేనని - కానీ ఆయనకు వాహనమే లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదనడం సరైంది కాదని, ఆయన కొడుకు పెండ్లికి కార్డు ఇవ్వడానికి ఎలా కలిశారని ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/