తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించినవారిలో కోదండరాం పాత్రం కీలకమైనదే! ఏమాటకామాట చెప్పుకోవాలంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అనంతరం ఆ స్థాయిలో క్రెడిబిలిటీ సంపాదించుకున్నవారు కూడా తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామే! అయితే పోరాడి తెచ్చుకున్న తెలంగాణ వచ్చేసింది, నాటి వాగ్ధానాల సంగతి కాసేపు పక్కనపెడితే, కేసీఆర్ ముఖ్యమంత్రయ్యారు. మరి కోదండరాం పరిస్థితి ఏమిటి? అనంతర పరిణామల్లో జరిగిన విషయాలన్నీ అందరికీ తెలిసినవే. ఈ క్రమంలో ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం పెంచారు కోదండరాం. దీంతో తెరాస నుంచి ఆయనపై రోజుకో విమర్శలు మొదలైపోయాయి. వాటిలో తాజాగా టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ చేసిన విమర్శలు మరింత ఘాటుగా ఉన్నాయి.
తెలంగాణ పోరాట సమయంలో జేఏసీల రూపంలో కోదండరాం ఏమి చేశారు ఏమి చేయలేదు అనే విషయాల సంగతి అలా ఉంచితే... తాజాగా ఎంపీ బాల్క సుమన్ చేసిన విమర్శలను పరిశీలిస్తే మాత్రం ఆయనంటూ ప్రత్యేకంగా పోరాడిందేమీ లేదు అనే సంకేతాలను ఇస్తున్నారు! కారణం... ఉద్యమ సమయంలో తెరాస వేసిన టెంట్ లో స్పీచ్ ఇవ్వడం తప్ప కోదండరాం చేసింది ఏమీలేదు అనేది బాల్క సుమన్ తాజా కామెంట్. ప్రస్తుతం కోదండరాం కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, ఇప్పుడున్నది టీజేఏసీ కాదు కేజేఏసీ అనేది సుమన్ మరో కామెంట్. ఈ రేంజ్ లో కోదండరాం పై తెరాస దాడిని పెంచేసింది.
దీంతో కోదండరాం... తెరాస తనపై చేస్తున్న విమర్శలపై ఎలా స్పందించబోతున్నారు, ఎటువంటి పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకోబోతున్నాయి వంటి సంగతులు తెలియాలంటే వేచి చూడాల్సిందే. కాగా ఆదివారం జరిగిన జేఏసీ సమావేశంలో ప్రజా సమస్యలపై ఉద్యమం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని కోదండరాం ప్రకటించిన నేపథ్యంలో తెరాస ఎంపీ సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/