కేసీయార్ పైనే బండి మైండ్ గేమా ?

Update: 2021-06-11 08:30 GMT
ముఖ్యమంత్రి కేసీయార్ మీదే తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లున్నారు. బండి అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీకి తెలంగాణాలో కాస్త ఊపు వచ్చినమాట నిజమే. స్వతహాగానే దూకుడు మనిషి కాబట్టి పార్టీ వ్యవహారాలను కూడా దూకుడు మీద నడుపుతున్నారు. అయితే పార్టీని నడపటానికి దూకుడు మాత్రమే ఉంటేం సరిపోదని బండికి అర్ధమైనట్లులేదు.

కాంగ్రెస్ మీద మైండ్ గేమ్ ఆడుతున్నట్లే కేసీయార్ మీద కూడా మొదలుపెట్టారు. అయితే అన్నీసార్లు అది వర్కవుట్ అవటంలేదు. తొందరలోనే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని తాజాగా బండి ప్రకటించారు. అధ్యక్షుడు అయినప్పటి నుండి ఇదే విషయాన్ని బండి చాలాసార్లు ప్రకటించారు. అయితే పెద్దగా ఫలితం కనబడలేదు.

కాంగ్రెస్ నుండి డీకే అరుణ, టీఆర్ఎస్ నుండి జితేందర్ రెడ్డి లాంటి అప్పుడెప్పుడో బీజేపీలో చేరారంతే. మళ్ళీ టీఆర్ఎస్ నుండి చెప్పుకోతగ్గ నేతలెవరు కమలం కండువా కప్పుకోలేదు. నిజానికి బీజేపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తే కాంగ్రెస్ నుండి ఎవరైనా నేతలు పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

అయితే బండి మాత్రం టీఆర్ఎస్ పైనే గురిపెట్టినట్లు అర్ధమవుతోంది. పార్టీలోని అంతర్గత వివాదాల వల్లే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చేశారు. ఆ పార్టీని ఈ పార్టీని తిరిగి చివరకు బీజేపీలో చేరబోతున్నారు. ఈటలతో పాటు ఇంకా కొంతమంది టీఆర్ఎస్ లో చేరిపోతారని కమలనాదులు గట్టిగానే ఆశించినట్లున్నారు. కాకపోతే ఇప్పటివరకు ఈటల విషయంలో మాత్రమే క్లారిటి వచ్చింది. అందుకనే వీలైనంతమంది గులాబీ నేతలను లాగేందుకు బండి మొదలుపెట్టిన మైండ్ గేమ్ ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News