బండి సంజయ్ పాదయాత్ర మళ్లీ వాయిదా? కారణం ఇదే!

Update: 2021-08-22 14:30 GMT
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు కాలం కలిసిరావడం లేదు. ఇదివరకే ఒకసారి ప్రకటించి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి ఈ పాదయాత్రకు బ్రేక్ పడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో సాగనున్న సంజయ్ పాదయాత్ర ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఆగస్టు 24న హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచే బండి సంజయ్ పాత్ర వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ శనివారం కన్నుమూశారు. దీంతో దీంతో ఈనెల 24వ తేదీ వరకు సంతాప దినాలుగా బీజేపీ ప్రకటించింది.  24వ తేదీ వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని పార్టీ శ్రేణులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఆ ప్రభావం బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర పై కూడా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

దీంతో ఈనెల 24 నుంచి బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్ర మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. కానీ ఇంకా పాదయాత్ర వాయిదాపై ఎలాంటి నిర్ణయం రాష్ట్ర నాయకత్వం తీసుకోలేదు.

కాగా ఇప్పటికే సంజయ్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన అశీర్వాద యాత్రతో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మరోసారి కళ్యాణ్ సింగ్ మృతి కూడా సంజయ్ యాత్రకు బ్రేక్ వేసే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News