తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వైట్ ఛాలెంజ్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సవాల్ విసిరితే, ఆ సవాల్‌ను స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లకు వైట్ ఛాలెంజ్ విసిరారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాకు వైట్ ఛాలెంజ్ చేశాడంట, ఆయన విసిరిన వైట్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని బండి సంజయ్ ప్రకటన చేశారు. తనకు ఎలాంటి అలవాట్లు లేవని.. అక్టోబర్ 2తో పాదయాత్ర పూర్తి అవుతుంది.
ఆ తర్వాత ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని స్పష్టం చేశారు బండి సంజయ్. ఈ రోజు తాడ్వాయి లో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడ్తామంటున్నారని.. దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. మక్కలు, వడ్లు కొనకపోతే కొనేటట్లు బీజేపీ, కెసిఆర్ మెడలు వంచుతదని పోడు భూముల మీద కొట్లాడితే మా మీద కేసులు పెట్టారని మండిపడ్డారు. అయినా పోడు భూముల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ వైట్ ఛాలెంజ్ తో పేద ప్రజలకు ఏం సంభందం బాగా బలిసినోడు బలుపు ఎక్కినోడు డ్రగ్స్ తీసుకుంటారని పేర్కొన్నారు. వైట్, బ్లాక్, పింక్, గ్రీన్, ఆరంజ్ ఏ ఛాలెంజ్ కి అయినా వెనక్కి పోనని స్పష్టం చేశారు బండి సంజయ్.
ఇటీవల గజ్వేల్ సభలో డ్రగ్స్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌తో తనకేం సంబంధమని, టెస్టులకు తాను సిద్దమని ప్రకటించారు. తన రక్తం,వెంట్రుకల నమూనాలు ఇచ్చేందుకు సిద్దమన్నారు. దీంతో రేవంత్ రెడ్డి కేటీఆర్ కు వైట్ ఛాలెంజ్ విసిరారు. గన్ పార్క్ వద్దకు వస్తే... అక్కడినుంచి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుని, సమాజానికి ఆదర్శంగా నిలుద్దామని కోరారు. దానికి కేటీఆర్తా ను ఎలాంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్టుకు సిద్ధమైతే,తానే ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్తానని ట్వీట్ చేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి తనది కాదని పేర్కొన్నారు.