గ్లామర్ కోసం డ్రగ్స్.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Update: 2021-09-09 04:44 GMT
టీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనను బట్టతల, గుండుగాడు అని విమర్శించిన నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. అవిప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ‘టీఆర్ఎస్ నేతల గ్లామర్ సంగతి తీస్తానని.. నీ గ్లామర్ ఎట్లుందో.. నువ్వు డ్రగ్స్ వాడుతున్న విషయం అందరికీ తెలుసు’ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.

బీజేపీ ప్రభుత్వం రాగానే మొదట రక్త పరీక్షలు మీకే చేస్తాం అని బండి సంజయ్ హెచ్చరికలు చేశారు. మీకు బొచ్చు ఎట్ల ఉందో.. మీకు ముక్కు ఎట్లుందో.. మీకు అందం ఎట్లుందో అందరికీ తెలుసు అని బండి సంజయ్ ఆరోపించారు. అందాన్ని కాపాడుకోవడం కోసం.. డ్రగ్స్ తీసుకుంటున్న విషయం వాస్తవం అని..చాలా మంది మీ నాయకులే చెబుతారని బండి సంజయ్ ఆరోపించారు. వారి పేర్లు చెప్పా అని.. మా ప్రభుత్వం రాగానే మీ అందరికీ రక్త పరీక్షలు చేస్తామని బండి సంజయ్ తీవ్రఆరోపణలు చేశారు.

రెండు సంవత్సరాలైనా రక్త నమూనాలు తీస్తే అది బయటపడుతుందని బండి సంజయ్ అన్నారు. భాష మార్చుకోవాలని.. మాకు గురువు కేసీఆర్ అని అన్నారు. గురుదక్షిణగా కేసీఆర్ ను చూసి మేం తిడుతున్నామని బండి అన్నారు. కేసీఆర్ కంటే ఇంకా మంచి భాష మాకు వస్తుందని అన్నారు. అలా మాట్లాడే అవకాశం కల్పించొద్దు.. వాడు వీడు అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వాళ్లు గాడు గీడు అంటే తప్పు లేదని.. మేం మాత్రం .. మేం కేసీఆర్ అంటే తప్పు అని బండి ఆరోపించారు. గారు గారు అంటేనే తెలంగాణ పరిస్థితి ఇలా అయ్యిందని మండిపడ్డారు. ఇటు పక్కన మొరిగేగాళ్లు.. వాడు ఎవ్వడూ తెలంగాణ ఉద్యమంలో లేరని.. హైదరాబాద్ లో ఉరికిస్తరట.. రేపు నీ దగ్గరకొస్తా.. ఉరికియ్ బిడ్డ.. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రాళ్లతో కొట్టుండ్రి అని కేసీఆర్ చెప్పాడని.. ఇప్పుడు అదే వస్తుందని బండి ఆరోపించారు. భాష రాజకీయ పార్టీగా అధికారంలో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడాలని.. ప్రజలు గుర్తిస్తారని అన్నారు.

ఢిల్లీకి పోయి కేసీఆర్ పొర్లు దండాలు పెడుతున్నాడని.. ఢిల్లీ పార్టీకే మొక్కుతున్నాడని బండి ఆరోపించారు. మీ వేషాలు వేసి సినిమా యాక్టర్లే భయపడుతున్నారని బండి ఆరోపించారు.


Full View
Tags:    

Similar News