ఆరాచకం:ఆ డెయిరీ పాలలో పందికొక్కులు..?

Update: 2015-10-01 04:36 GMT
చంటి పిల్లల నుంచి పెద్దవాళ్లు తాగే పాలలో ఏ మాత్రం తేడా వచ్చినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నిత్యం అందరూ సేవించే పాల విషయంలో డెయిరీ నిర్లక్ష్యం ఆశ్చర్యకరంగా మారటమే కాదు.. విన్నవారంతా షాక్ కు గురయ్యే పరిస్థితి.

ఏపీలోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విజయ డెయిరీ యాజమాన్యం ఏ స్థాయిలో ఉంటుందో తెలియజెప్పే ఘటన ఇది. ఇటీవల ఆ జిల్లాకు చెందిన ఒక చిన్నారి డెంగ్యూని మరణించింది. దీనిపై విచారణ మొదలు పెట్టిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాకింగ్ సమాచారం బయటకు వచ్చింది.

తమ తనిఖీల్లో భాగంగా విజయడెయిరీ కోల్డ్ స్టోరేజీని పరిశీలిస్తే.. అక్కడ పాల ప్యాకెట్లు ఉంచే ట్రేలలో పందికొక్కులు తిరగటాన్ని గుర్తించారు. దీన్ని తీవ్రంగా పరిగణించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పసి పిల్లలు తాగే పాల విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోని డెయిరీ యాజమాన్యాన్ని ఏమనాలి? ఇంతకు మించిన ఆరాచకం ఇంకేం ఉంటుంది..?
Tags:    

Similar News