బండ్ల గణేష్ తొలిసారి మీడియా ముందుకొచ్చాడు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గెలవకపోతే ‘గొంతు కోసుకుంటానని’బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో వీరావేశంతో అన్నారు. కానీ కాంగ్రెస్ ఓడింది. టీఆర్ ఎస్ ఘనవిజయం సాధించింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత బండ్ల గణేష్ సైలెంట్ అయ్యారు.
తాజాగా ఓ చానెల్ ఇంటర్వ్యూకు వచ్చిన బండ్ల గణేష్ సోషల్ మీడియా - కొన్ని మీడియా సంస్థలు తనను బలి చేశాయని బండ్ల గణేష్ ఆరోపించారు. బండ్ల గణేష్ గొంతు కోసుకుంటానని ప్రకటించారని.. కొందరు బ్లేడుతో నా ఇంటి వద్ద కాపుకాశారని.. అది చూసి తన భార్య పిల్లలు చాలా బాధపడ్డారని.. మనస్థాపంతో ఏమైనా చేసుకుంటే తన గతి ఏంటని బండ్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల వేళ వంద అంటారని.. కేసీఆర్ - మోడీ వీడియోలను చూపించారు. వారు హామీ ఇచ్చి తప్పిన మాటను బండ్ల ఇంటర్వ్యూలో నిరూపించారు. అలాగే ఎన్టీఆర్ - కరుణా నిధి - హరీష్ రావు సహా చాలామంది మాట ఇచ్చి నెరవేర్చని వారి గురించి బండ్ల వివరించారు. వారందరి దగ్గరకు ఇలానే గొడ్డల్లు పట్టుకొని జర్నలిస్టులు వెళ్లారా అని బండ్ల నిలదీశారు. తాను బలహీనుడనే ఇలా తనను టార్గెట్ చేశారని వివరించారు.
ఇక గెలిచిన టీఆర్ ఎస్ నాయకులు తనను ఒక్క మాట కూడా అనలేదని.. వారిది మంచి మనసు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఇవి సహజమని.. నువ్వు ఇలానే ఉత్సాహంగా మాట్లాడాలని ఎంకరేజ్ చేశారని బండ్ల గణేష్ వివరించారు. మీడియా - సోషల్ మీడియాలో మాత్రమే తనను టార్గెట్ చేసి వేధించారని వివరించారు.