నటులపై పోస్ట్ పెట్టినందుకు చితకబాదారు!

Update: 2016-09-11 07:22 GMT
తమిళనాడు - కర్ణాటక జలవివాదం సుప్రీంకు వెళ్లడం, ఈ విషయంపై సుప్రీం స్పందించడం తెలిసిందే. ఈ విషయాలపై తమిళనాడుకు పదిహేనువేల క్యూసెక్కుల నీటిని పదిరోజులపాటు విడుదల చేయాలని కర్ణాటకను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇలా సుప్రీం ఉత్తర్వులు జారీచేయడంపై కర్ణాటక మొత్తం భగ్గుమంది. ఈ సమయంలో ఈ కావేరీ నదీ జలాల విషయంపై కన్నడ నటులు కూడా ఆందొళనకు దిగారు. అయితే.. ఈ ఆందోళనలను ఒక యువకుడు ఎద్దేవా చేయడంతో.. అతడికి చేదు అనుభవంం ఎదురైంది.

కావేరీ జలాల విషయంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ సంఘాలు ఆందోళనకు దిగి, రాష్ట్రవ్యాప్తంగా బంద్ ను చేపట్టాయి. ఈ సమయంలో కన్నడ నటులు శివరాజ్ కుమార్ - దునియా విజయ్ - దర్శన్ - రాగిణి ద్వివేది లు పాల్గొన్నారు. ఈ విషయాన్ని తప్పుపడుతూ ఒక ప్రైవేటు కాలేజీలో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి డి. సంతోష్ తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అతని పోస్టు ఇప్పుడు కర్ణాటకలో వైరల్‌ గా మారింది. దీంతో ఆ పోస్ట్ పై ఆగ్రహించిన బెంగళూరు స్థానిక యువకులు కొందరు అతన్ని వెతికిమరీ పట్టుకుని, కాలేజీ గేటు వద్ద అతన్ని అటకాయించి చితకబాదారు. ఐదుగురు యువకులుఅతన్ని చుట్టుముట్టి చితకబాదిన సంఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం ఆన్‌ లైన్‌ లో హల్ చల్ చేస్తుంది.
Full View

Tags:    

Similar News