పెద్ద నోట్ల రద్దుతో మనమంతా ఎంత ఇబ్బంది పడుతున్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నోట్లు సరిపడా అందుబాటులో లేక బ్యాంకుల్లో గంటల పాటు పడిగాపులు తప్పడం లేదు. అయితే మెరుగైన చదువు - ఇంగ్లిష్ పై పట్టున్న మనతో పోలిస్తే...గ్రామీణ ప్రాంతాల్లోని వారు - ఆంగ్లం మీద అస్సలే అవగాహన లేని వారి పరిస్థితి దారుణం. బ్యాంకు అకౌంట్ తీసుకోవాలనుకున్నా - పాస్ బుక్ లో క్రెడిట్ - డెబిట్ వంటి పదాలు అర్థం కావాలన్నా వారి బాధలు వర్ణణాతీతం. ఇక చెక్‌బుక్ వంటివాటి జోలికే పోరు. ఇకపై ఇలా ఆంగ్లంలో రాయలేక ఇబ్బందులు పడుతున్న బాధలు దూరమయ్యే అవకాశాలు వచ్చేశాయి.
ఇకపై ప్రాంతీయ భాషల్లో మీ బ్యాంకు లావాదేవీలు జరుపుకోవచ్చు. దీనిపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్ లో కూడా కేంద్రమంత్రి సంతోష్ కుమార్ స్పష్టంచేశారు. గ్రామీణ - సెమీఅర్బన్ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్లో వీటిని కచ్చితంగా అమలుచేయాలని సూచించారు. ఇప్పటివరకు బ్యాంకులకు సం బంధించి అకౌంట్ తీయడానికి - పాస్ బుక్ ఇతర లావాదేవీలన్నీ ఇంగ్లిష్ - హిందీ భాషల్లోనే జరిగాయి. విత్ డ్రా - డిపాజిట్ ఫారాలు కూడా రెండు భాషల్లోనే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇకపై ప్రభుత్వం గుర్తించిన ప్రాంతీయ భాషలు కూడా ఉండాలని ఆర్బీఐ పేర్కొంది. బుక్ లెట్స్ తో పాటు - బ్యాంకుల్లో ప్రదర్శించే సైన్ బోర్డులు వినియోగదారులతో మాట్లాడేక్రమంలో కూడా ప్రాంతీయ భాషలను ఉపయోగించాలని సర్క్యూలర్ లో సూచించింది. చెక్ బుక్ లో ఆంగ్లంతోపాటు హిందీ లో రాసినా అంగీకరించాలని ఆదేశించింది. దీంతో సామాన్యుల కష్టాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/