పెను రాజకీయ సంచలనం సృష్టించిన కోడెల శివప్రసాదరావు మృతి చుట్టు అనేక అనుమానాలు ముసురుకున్న నేపథ్యంలో బసవతారకం ఆస్పత్రి అధికారిక ప్రకటనను విడుదల చేసింది. బసవతారకం ఆస్పత్రి సీఈవో ఆర్వీ ప్రభాకర్ రావు పేరుతో విడుదలైన ప్రకటనలో ఏముందంటే...
‘‘ఈరోజు ఉదయం 11.35 గంటలకు కోడెల శివప్రసాదరావును ఆస్పత్రికి అచేతన స్థితిలో తీసుకువచ్చారు. ప్రొటోకాల్ ను అనుసరించి వెంటనే వైద్యం మొదలుపెట్టాం. ఆయన దేహంలో చలనం కోసం ప్రయత్నించాం. మా వైద్య నిపుణులు ఎంత ప్రయత్నం చేసినా ఎటువంటి ఫలితం దక్కలేదు. శరీరంలో ఏ స్పందన కనిపించలేదు. దీంతో 12.39 నిమిషాలకు ఆయన మరణించినట్లు ప్రకటించాం‘‘
అయితే, ఈ ప్రకటనలో కోడెలను ఆస్పత్రికి ఎవరు తెచ్చారు అనే సమాచారం లేదు. మరో ప్రకటనలో పోలీసులు మాత్రం కుటుంబ సభ్యులు పని మనిషితో కలిసి ఆయన్ను ఆస్పత్రికి తెచ్చినట్టు వెల్లడించారు.